E-Paper
Advertisement

కూలర్‌లో నీళ్లు పోస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. కరెంటు షాక్ పక్కా!

కూలర్‌లో నీళ్లు పోస్తున్నారా? ఈ తప్పులు చేశారో.. కరెంటు షాక్ పక్కా!
Advertisement

Cooler Safety Tips: వేసవిలో ఏసీలు, కూలర్ల వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే కూలింగ్ ఇవ్వాల్సిన ఏసీలు.. బాంబుల్లా పేలుతూ ప్రాణాలు బలిగొంటున్న ఉదంతాలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా కూలర్ సైతం ఆ జాబితాలో చేరిపోయింది. నిర్మల్ జిల్లాలో కూలర్లలో నీరు పోస్తూ కరెంటు షాక్ కు గురై తండ్రి కొడుకులు ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో ఇలాంటి విషాదం పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక కథనం అందించడం జరుగుతోంది. షాక్ కొట్టకుండా నీరు పోయడానికి పాటించాల్సిన 5 ప్రధాన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

విద్యుత్ కనెక్షన్ కట్

కూలర్‌లో నీరు పోసే ముందు చేయాల్సిన అతి ముఖ్యమైన పని.. విద్యుత్ కనెక్షన్ ను తొలగించడం. కొందరు స్విచ్ ఆఫ్ చేసి.. సాకెట్ ను అలాగే ప్లగ్ కు ఉంచేస్తారు. ఇది కరెక్ట్ కాదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు వైరింగ్ లోపాల వల్ల స్విచ్ ఆఫ్ చేసినా కరెంట్ సరఫరా అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్లగ్ పూర్తిగా తీసేసి కరెంట్ కనెక్షన్ లేదని నిర్ధారించుకున్న తర్వాతే నీరు పోయాలని హితవు పలుకుతున్నారు.

వాటర్ పైప్ లేదా మగ్గు వాడకం

Advertisement

కూలర్‌లో నీరు పోసేటప్పుడు వాటర్ పైప్ లేదా ప్లాస్టిక్ మగ్గును ఉపయోగించడం మంచిది. నీరు పోస్తున్నప్పుడు ఆ నీటి చుక్కలు.. కూలర్ లోపల ఉండే మోటార్, కరెంట్ వైర్లపై పడకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్ భాగాలపై నీరు పడితే షార్ట్ సర్క్యూట్ జరిగి కూలర్ బాడీ మొత్తానికి కరెంట్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇనుప కూలర్లతో జాగ్రత్త

మెటల్ బాడీ ఉన్న కూలర్ వాడుతుంటే మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాడీతో పోలిస్తే మెటల్ కూలర్లలో షాక్ కొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుదని హెచ్చరిస్తున్నారు. నీరు పోసేటప్పుడు చేతులు లేదా శరీరం కూలర్ మెటల్ భాగానికి నేరుగా తగలకుండా చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. వీలైతే ప్లాస్టిక్ కూలర్లను వాడటం లేదా మెటల్ కూలర్లకు సరైన పెయింటింగ్ ఉండేలా చూసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

కాళ్లకు చెప్పులు తప్పనిసరి

Advertisement

కూలర్‌లో నీరు పోసేటప్పుడు ఎప్పుడూ ఖాళీ కాళ్ళతో (నగ్నపాదాలతో) ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పొడిగా ఉన్న ప్లాస్టిక్ లేదా రబ్బర్ చెప్పులు ధరించాలని స్పష్టం చేస్తున్నారు. పొరపాటున కూలర్ నుండి స్వల్పంగా కరెంట్ లీకేజీ జరిగినా.. కాళ్ళకు చెప్పులు ఉంటే అది ఎర్తింగ్‌గా మారకుండా అడ్డుకుంటుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.

Also Read: టీవీ రిమోట్లో కలర్ బటన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

తడి చేతులతో తాకొద్దు..

చేతులు తడిగా ఉన్నప్పుడు కూలర్‌ను గానీ, దాని వైర్లను గానీ ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. అలాగే కూలర్ చుట్టుపక్కల నేల భాగం నీరు చింది తడిగా లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ నీరు కింద పడితే వెంటనే దాన్ని తుడిచేయాలని పేర్కొంటున్నారు. తడి నేలపై నిలబడి కూలర్‌లో నీరు పోయడం చాలా ప్రమాదకరమని స్పష్టం చేస్తున్నారు. మెుత్తంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే.. కూలర్ నుంచి వచ్చే షాక్ ను దాదాపు నివారించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: హైయర్ సరికొత్త స్మార్ట్ ఏసీ.. 60 డిగ్రీల ఎండ ఉన్నా.. ఇంట్లో మంచు కురవాల్సిందే!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×