Haier Desert Rose AC: హైయర్ (Haier) సంస్థ లాంచ్ చేసిన ‘హైయర్ 1.7 టన్ 5 స్టార్ డెజర్ట్ రోజ్ ఏసీ’ (Haier 1.7 Ton 5 Star Desert Rose AC) ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. పెద్ద లివింగ్ రూమ్‌లు, హాల్స్ (లౌంజ్) కోసం ప్రత్యేకంగా డిజైన్ యూజర్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుత వేసవి నేపథ్యంలో ఏసీలకు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ ఏసీ పనితీరు, ఫీచర్లు, ప్లస్ మైనస్‌ల గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణంగా ఏసీలు అనగానే మనకు తెలుపు రంగు మాత్రమే గుర్తొస్తుంది. కానీ హైయర్ ఈసారి రూట్ మార్చింది. దీనికి ఇచ్చిన ‘డెజర్ట్ రోజ్’ (Desert Rose) ప్రీమియం కలర్ షేడ్ మీ ఇంటి లౌంజ్ లేదా హాల్‌కు ఒక విలాసవంతమైన లుక్ ను అందించనుంది. దీని ఇంటీరియర్ డిజైన్.. మోడ్రన్‌గా, క్లాసీగా ఉంది. పెద్ద హాల్స్‌లో ఇది కేవలం ఏసీలా కాకుండా ఒక అందమైన డెకరేషన్ పీస్‌లా ఒదిగిపోతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏసీ 1.7 టన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఇంట్లోని పెద్ద లౌంజ్ లేదా లివింగ్ రూమ్‌ను కూడా క్షణాల్లోనే ఇది చల్లబరిచేస్తుంది. బయట ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్‌కు చేరినా కూడా ఇది సమర్థవంతంగా కూలింగ్ ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిలోని శక్తివంతమైన బ్లోయర్.. గదిలోని ప్రతి మూలకు చల్లటి గాలిని సమానంగా పంపుతుందని తెలియజేస్తున్నాయి. పెద్ద హాల్‌లలో ఉండే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
హైయర్ ఏసీ 5 స్టార్ రేటింగ్ ను కలిగి ఉండటం వల్ల కరెంట్ బిల్లు భయం ఉండదు. ఈ డెజర్ట్ రోజ్ విద్యుత్ ను చాలా పొదుపుగా వినియోగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఇందులో ఉన్న ఇన్వర్టర్ టెక్నాలజీ గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా కంప్రెసర్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేస్తుందని పేర్కొన్నాయి. కాబట్టి రోజంతా ఏసీ ఆన్ చేసినా జేబుకు చిల్లు పడుతుందనే భయం అక్కర్లేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
హైయర్ ఏసీ.. ఆహ్లాదకరమైన కూలింగ్ ను ఇవ్వడంతోపాటు అద్భుతమైన స్మార్ట్ ఫీచర్లను సైతం కలిగి ఉంది. ఇందులో వై-ఫై (Wi-Fi) కనెక్టివిటీ ఉంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సాల ద్వారా వాయిస్ కమాండ్స్‌తోనే ఏసీని ఆన్, ఆఫ్ చేయవచ్చు. అదే విధంగా టెంపరేచర్ మార్చవచ్చు. ఇక దీనిలోని ‘సెల్ఫ్ క్లీన్’ బటన్ నొక్కితే ఏసీ కాయిల్స్ పై ఉన్న దుమ్ము, ధూళి ఐస్ రూపంలో మారి, కరిగి బయటకు కొట్టుకుపోతాయి. దీనివల్ల సర్వీసింగ్ ఖర్చులు తగ్గడమే కాకుండా, ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గాలి గదిలోకి వస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్
ఇంటి లౌంజ్ లేదా పెద్ద హాల్ కోసం క్రేజీ లుక్, ప్రీమియం క్వాలిటీ ఏసీ కోసం చూస్తుంటే… ‘హైయర్ 1.7 టన్ 5 స్టార్ డెజర్ట్ రోజ్ ఏసీ’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది రూ.54,160 – 55,990 మధ్య అందుబాటులో ఉంది. ధర కొంచెం ప్రీమియం రేంజ్‌లో ఉన్నప్పటికీ ఇందులో ఉన్న ఫీచర్లు, లుక్స్, కరెంట్ ఆదాను బట్టి చూస్తే.. పెట్టే పెట్టుబడికి ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పవచ్చు.
Also Read: ప్రయాణాల్లో 5G నెట్‌వర్క్‌ను ఆన్‌లో ఉంచుతున్నారా? జరిగే నష్టం తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు!