E-Paper
Advertisement

పాత ఛార్జింగ్ కేబుల్స్ పారేస్తున్నారా? ఆగండి.. ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు!

పాత ఛార్జింగ్ కేబుల్స్ పారేస్తున్నారా? ఆగండి.. ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు!
Advertisement

How to reuse old charging cables: ఈ రోజుల్లో మన ఇంట్లో స్మార్ట్‌ఫోన్లతో పాటు ఛార్జింగ్ కేబుల్స్ కూడా గుట్టలుగా పేరుకుపోతుంటాయి. కొద్దిగా పాతబడినా, లేదా వైర్ ఒక పక్కన లూజ్ అయినా అవి వేస్ట్ అని మనం డస్ట్‌బిన్‌లో పారేస్తుంటాం. దీని వల్ల ఈ-వేస్ట్ పెరిగి పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుంది. అయితే.. కొద్దిగా క్రియేటివిటీ ఉపయోగిస్తే.. ఆ పనికిరాని పాత కేబుల్స్‌ను మన ఇంట్లోనే రోజువారీ అవసరాలకు ఎంతో అద్భుతంగా వాడుకోవచ్చు. పాత వైర్లను ఎలా రీయూస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత ఛార్జింగ్ కేబుల్స్ రీయూస్ హ్యాక్స్:

Advertisement

మొబైల్ ఫోన్ మార్చినప్పుడల్లా లేదా డేటా కేబుల్ పాడైనప్పుడల్లా కొత్తవి కొంటూ ఉంటాం. కానీ పాత వైర్ల లోపల ఉండే మెటీరియల్ చాలా బలంగా ఉంటుంది. గూగుల్ డిస్కవరీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న కొన్ని బెస్ట్ అండ్ ఈజీ హోమ్ ఆర్గనైజేషన్ హ్యాక్స్..

1. వైర్లను ముడిపడేలా చేసే ‘కేబుల్ టై’:
మన ఇంట్లో టీవీ వైర్లు, కంప్యూటర్ వైర్లు, లేదా ఇతర ఎలక్ట్రానిక్ వైర్లు అన్నీ కలిసిపోయి ఒక పెద్ద గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడటానికి అస్సలు బాగుండవు.

Advertisement

ఎలా వాడాలి?: మీ పాత ఛార్జింగ్ కేబుల్‌ను చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ ముక్కలతో ఇంట్లోని ఇతర పెద్ద పెద్ద వైర్లన్నింటినీ ఒకచోట చేర్చి నీట్‌గా ముడివేయండి.

లాభం:మార్కెట్లో ప్రత్యేకంగా కేబుల్ టైస్ కొనాల్సిన పని లేకుండా.. ఇల్లాంతా వైర్లు కనిపించకుండా క్లీన్ గా ఉంటుంది.

2. ఖరీదైన ఫోన్ హోల్డర్ :
మీ పాత కేబుల్ లోపల కాపర్ లేదా అల్యూమినియం వైర్లు ఉండడం వల్ల వాటిని మనకు నచ్చినట్లు వంచవచ్చు.

ఎలా వాడాలి?: యూఎస్‌బీ పోర్టులను కట్ చేసి, మిగిలిన గట్టి వైర్‌ను ఒక స్టాండ్ ఆకారంలో (W లేదా U షేప్) వంచండి.

లాభం: మీరు టేబుల్‌పై కూర్చుని సినిమాలు చూసేటప్పుడు లేదా ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు ఇది ఒక బెస్ట్ మొబైల్ స్టాండ్‌లా పనిచేస్తుంది. రూపాయి ఖర్చు లేని బెస్ట్ ఐడియా ఇది.

3. కీచైన్ , హ్యాంగింగ్ లూప్స్ :
ఛార్జర్ కేబుల్స్ పైభాగంలో ఉండే ప్లాస్టిక్ లేదా నైలాన్ మెటీరియల్ అంత ఈజీగా తెగిపోదు. చాలా గట్టిగా ఉంటుంది.

ఎలా వాడాలి?: కేబుల్‌ను చిన్న లూప్ (రింగ్) లాగా మడిచి, దానికి ఒక కీ-రింగ్ తగిలించండి. లేదా వంటగదిలో.. బాత్రూమ్‌లో చిన్న చిన్న వస్తువులు తగిలించుకోవడానికి హుక్స్ లాగా వాడుకోవచ్చు.

లాభం: ఇది చాలా బరువును కూడా మోయగలదు కాబట్టి కీస్, టవల్స్ తగిలించుకోవడానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

4. గార్డెనింగ్‌లో మొక్కలకు సపోర్ట్ :
మీకు పెరట్లో గానీ, బాల్కనీలో గానీ మొక్కలు పెంచే అలవాటు ఉంటే ఈ హ్యాక్ మీకు బాగా నచ్చుతుంది.

ఎలా వాడాలి?: మనీ ప్లాంట్ లేదా ఇతర తీగ జాతి మొక్కలు పైకి పాకడానికి సపోర్ట్‌గా పాత ఛార్జర్ వైర్లతో కట్టవచ్చు.

లాభం: సాధారణ జనప నార తాడు లేదా ప్లాస్టిక్ తాళ్లు ఎండకు, వానకు త్వరగా పాడైపోతాయి. కానీ ఛార్జర్ కేబుల్స్ వాటర్‌ప్రూఫ్ కాబట్టి మొక్కలకు ఎక్కువ కాలం గట్టి సపోర్ట్ ఇస్తాయి.

5. క్రియేటివ్ డెకరేషన్ ఐటమ్స్ :
ఇంట్లో పిల్లలు ఉంటే.. ఈ పాత కలర్‌ఫుల్ డేటా కేబుల్స్‌తో మంచి క్రాఫ్ట్స్ చేయించవచ్చు.

ఎలా వాడాలి?: వేర్వేరు రంగుల ఛార్జింగ్ కేబుల్స్ (బ్లాక్, వైట్, రెడ్) సేకరించి, వాటిని ఒకదానితో ఒకటి అల్లి పెన్ స్టాండ్‌ల చుట్టూ లేదా ఫోటో ఫ్రేమ్‌ల చుట్టూ డిజైన్‌గా అంటించవచ్చు.

లాభం: వెరైటీ లుక్ రావడమే కాకుండా.. ఈ-వేస్ట్‌ను రీసైకిల్ చేసినట్లు అవుతుంది.

పాత వస్తువులను పారేయడం కంటే.. వాటిని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే నిజమైన స్మార్ట్‌నెస్. ఒకవేళ మీ దగ్గర ఉన్న పాత ఛార్జింగ్ వైర్లు పైన చెప్పిన వేటికీ పనికిరావు అనుకుంటే.. వాటిని చెత్త బుట్టలో వేయకుండా, మీ ఊరిలో ఉండే ఏదైనా ఈ-వేస్ట్ కలెక్షన్ సెంటర్‌కు ఇవ్వండి. దీని వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లోని పాత వైర్లతో ఈ హ్యాక్స్ ట్రై చేయండి

Tags

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×