E-Paper
Advertisement

LG Gallery TV: మీ ఇంటి గోడలను ఆర్ట్ గ్యాలరీగా మార్చేయండి.. అద్భుత ఫీచర్లతో కొత్త ఎల్‌జి టివి లాంచ్

LG Gallery TV: మీ ఇంటి గోడలను ఆర్ట్ గ్యాలరీగా మార్చేయండి.. అద్భుత ఫీచర్లతో కొత్త ఎల్‌జి టివి లాంచ్
Advertisement

LG Gallery TV| 2026 నూతన సంవత్సరం సందర్భంగా టెక్ బ్రాండ్ LG ఎలక్ట్రానిక్స్ కొత్త టీవీని అనౌన్స్ చేసింది. ఈ టీవి ముఖ్యంగా ఇంట్లో గ్యాలరీ లేని లోటుని తీరుస్తుంది. దీని పేరు ఎల్‌జి గ్యాలరీ టివి. టెక్నాలజీని ఒక కళగా చూసే వారికి, ఇంటి డెకోర్‌తో బ్లెండ్ అయ్యే టెక్ కావాలనుకునేవారికి ఈ ఈ LG గ్యాలరీ టీవీ మంచి ఆప్షన్. జనవరి 6, 2026 నుంచి లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో LG దీన్ని షోకేస్ చేయనుంది.

డిజిటల్ కాన్వాస్‌లా డిజైన్

LG గ్యాలరీ టీవీని డిజిటల్ కాన్వాస్‌లా డిజైన్ చేసింది. సాధారణ టెలివిజన్ల నుంచి ఇది పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. గోడపై ఫ్రేమ్ చేసిన పెయింటింగ్‌లా అనిపిస్తుంది. 55 అంగుళాలు, 65 అంగుళాల సైజులలో లభిస్తుంది. స్లిమ్ డిజైన్ వల్ల గోడకు ఫ్లష్‌గా మౌంట్ చేయవచ్చు.

మాగ్నెటిక్ ఇంటర్‌చేంజబుల్ ఫ్రేమ్స్

Advertisement

ఈ టీవీలో ముఖ్య ఫీచర్ మాగ్నెటిక్ ఇంటర్‌చేంజబుల్ ఫ్రేమ్స్. ఇంటి డెకోర్‌కు తగ్గట్టు ఫ్రేమ్స్ మార్చుకోవచ్చు. ఈ కస్టమైజేషన్ వల్ల టీవీ నిజమైన ఆర్ట్ పీస్‌లా మారుతుంది. లివింగ్ స్పేస్‌తో సీమ్‌లెస్‌గా బ్లెండ్ అవుతుంది.

ఆర్ట్ కోసం స్పెషల్ గ్యాలరీ మోడ్

మ్యూజియం క్యూరేటర్లతో కలిసి LG ఈ టీవీని డెవలప్ చేసింది. స్పెషల్ గ్యాలరీ మోడ్ ఉంది. ఈ మోడ్ కలర్ యాక్యురసీ, బ్రైట్‌నెస్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. డిజిటల్ ఆర్ట్‌వర్క్స్ నిజమైన పెయింటింగ్స్‌లా టెక్స్చర్‌తో కనిపిస్తాయి. డిస్‌ప్లే సర్ఫేస్ గ్లేర్, రిఫ్లెక్షన్స్ తగ్గిస్తుంది.

స్మార్ట్ యాంబియంట్ లైట్ సెన్సార్

Advertisement

టీవీలో యాంబియంట్ లైట్ సెన్సార్ బిల్ట్-ఇన్‌గా ఉంది. రోజంతా లైటింగ్ బట్టి పిక్చర్ సెట్టింగ్స్ అడ్జస్ట్ చేస్తుంది. ఏ లైటింగ్ కండీషన్‌లోనైనా ఆప్టిమల్ వ్యూయింగ్ లభిస్తుంది.

AI పవర్‌తో మినీLED 4K ప్యానల్

ఈ టీవీలో OLED కాకుండా మినీLED 4K ప్యానల్ ఉంది. LG α7 AI ప్రాసెసర్ ఈ టీవి పనితీరును పవర్ చేస్తుంది. AI సౌండ్ ప్రో వర్చువల్ 9.1.2-ఛానల్ ఆడియో ఇస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఇష్టమైన విజువల్స్ సేవ్ చేసుకోవచ్చు.

Also Read: కెమెరా లేని స్పెషల్ ఐఫోన్‌.. ధర చాలా ఎక్కువ.. ఎందుకంటే?

 

గ్యాలరీ+ సర్వీస్ ప్లాట్‌ఫామ్ లాంచ్ 

ఈ టీవీతో పాటు LG కొత్త గ్యాలరీ+ సర్వీస్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో 4,500కి పైగా విజువల్ వర్క్స్ ఉన్నాయి. ఫైన్ ఆర్ట్, సినిమాటిక్ సీన్స్, గేమ్ విజువల్స్, యానిమేషన్లు ఉన్నాయి. ప్రతి నెలా లైబ్రరీ రిఫ్రెష్ అవుతుంది.

కస్టమ్ కంటెంట్ క్రియేషన్ చేయవచ్చు

జెనరేటివ్ AIతో కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. పర్సనల్ ఫోటోలను స్క్రీన్‌పై డిస్‌ప్లే చేయవచ్చు. గ్యాలరీ+ లిమిటెడ్ ఫ్రీ వర్షన్ ఉంది. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌తో పూర్తి కంటెంట్ లైబ్రరీ అన్‌లాక్ అవుతుంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×