E-Paper
Advertisement

U-turn Indicators: చైనా కార్లలో సరికొత్త ఇండికేటర్, ఇక హ్యాపీగా యూటర్న్ తీసుకొవచ్చు!

U-turn Indicators: చైనా కార్లలో సరికొత్త ఇండికేటర్, ఇక హ్యాపీగా యూటర్న్ తీసుకొవచ్చు!
Advertisement

China U-turn Indicators: సాధారణంగా కార్లలో రెండు రకాల ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి లెప్ట్ టర్న్ ఇండికేటర్ కాగా, రెండోది రైట్ టర్న్ ఇండికేటర్. ఇటీవల మరో కొత్త ఇండికేటర్ ను తీసుకొచ్చింది.  అదేయూటర్న్ ఇండికేటర్. దీనిని U-టర్న్ సిగ్నల్ అని కూడా పిలుస్తున్నారు. ఇది కారు వెనుక భాగంలో ఒక పెద్ద బాణం ఆకారంలో మెరిసేలా ఏర్పాటు చేశారు.  డ్రైవర్ యూటర్న్ తీసుకోబోతున్నాడని స్పష్టంగా చూపిస్తుంది. ఈ U-టర్న్ సిగ్నల్ రోడ్ సేఫ్టీని మెరుగుపరచడానికి, డ్రైవర్ ఇంటెన్షన్‌ను వెనుక ఉన్న వాహనదారులకు స్పష్టంగా చెప్పేలా ఉపయోగపడనుంది. ఇది ప్రత్యేకంగా చైనీస్ కార్ బ్రాండ్లలో.. ముఖ్యంగా Human Horizons HiPhi Z లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌ లో కనిపిస్తుంది.

U టర్న్ ఇండికేటర్ ఎలా పని చేస్తుందంటే?

U టర్న్ ఇండికేటర్ కారు వెనుక భాగంలో ఎక్స్ ట్రా టర్న్ సిగ్నల్ లైట్. ఇది U-టర్న్ ఆరోను ఫ్లాష్ చేస్తుంది. స్టాండర్డ్ టర్న్ ఇండికేటర్లతో పాటు ఆక్టివేట్ అవుతుంది. సాధారణంగా  ట్రాఫిక్‌ లో U-టర్న్ తీసుకునేటప్పుడు, డ్రైవర్ రైట్ హ్యాండ్ స్టీరింగ్ కాలమ్ స్టాక్‌ను రెండుసార్లు ట్యాప్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. ఈ ఇండికేటర్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది వెనుక ఉన్న వాహనాలకు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేయబడింది.

U టర్న్ ఇండికేటర్ ఏ కార్లలో ఉంది?

Advertisement

U టర్న్ ఇండికేటర్ Human Horizons HiPhi Z అనే చైనీస్ ఎలక్ట్రిక్ సూపర్‌ కార్లలో ఎక్కువగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇండికేటర్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇతర చైనీస్ కార్ బ్రాండ్లలో కూడా ఇలాంటి ఫీచర్లు టెస్టింగ్ లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ చేయబడుతున్నాయి, BYD Yangwang U8 లాంటి మోడల్స్‌ లో స్టేషనరీ U-టర్న్ ఫీచర్ ఉంది. కానీ, డెడికేటెడ్ ఇండికేటర్ HiPhi Zలోనే ఉంది.

U టర్న్ ఇండికేటర్ తో లాభాలేంటి?  

సాధారణ టర్న్ సిగ్నల్స్, హాజార్డ్ లైట్లతో కన్ఫ్యూజన్ ఉంటుంది. U-టర్న్ ఇండికేటర్ డ్రైవర్ ఇంటెన్షన్‌ను క్లియర్ గా   చూపిస్తుంది. ముఖ్యంగా బిజీ అర్బన్ ట్రాఫిక్‌ లో అక్సిడెంట్స్ ను తగ్గిస్తుంది. చైనా సిటీలలో ట్రాఫిక్ జామ్‌లు సాధారణం. ఇది మిస్‌రీడ్ లేన్ చేంజెస్, లెఫ్ట్ టర్న్‌ ల వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.  చైనా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం U-టర్న్ చేసేటప్పుడు స్పష్టమైన సిగ్నల్ ఇవ్వాలి. ఈ ఇండికేటర్ ఆ పద్దతిని ఈజీ చేస్తుంది.

Advertisement

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

ఇటీవల U టర్న్ ఇండికేటర్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ ఇన్నోవేషన్ ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇండికేటర్స్ తో రోడ్ సేఫ్టీ మరింత మెరుగుపడుతుందంటున్నారు. చైనాలో ఇలాంటి ఫీచర్లు కొన్ని ప్రాంతాల్లో సాధారణం. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్, రోడ్ డిజైన్ వల్ల యూటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ భారత్ లాంటి  దేశాల్లో ఇంకా అధికారికంగా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాలేదు.

Read Also: టాటా నుంచి కళ్లు చెదిరి కారు.. అవిన్యా ఈవీని చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×