E-Paper
Advertisement

ఏసీ బిల్లును సగానికి తగ్గించే ‘20 డిగ్రీల నియమం’.. ఇదెలా పనిచేస్తుందంటే?

ఏసీ బిల్లును సగానికి తగ్గించే ‘20 డిగ్రీల నియమం’.. ఇదెలా పనిచేస్తుందంటే?
Advertisement

20 Degree AC Rule: వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇంట్లో ఏసీ వాడకం తప్పనిసరి అవుతుంది. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీ ఆన్ చేయడం మంచిదే అయినా, అది ఎలా పడితే అలా వాడితే కరెంట్ బిల్లు మోత మోగడమే కాకుండా ఏసీ కూడా త్వరగా పాడైపోతుంది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి నిపుణులు ఒక అద్భుతమైన సూత్రాన్ని చెబుతున్నారు. అదే ‘20 డిగ్రీల నియమం’.

ఏంటీ 20 డిగ్రీల నియమం?

ఈ నియమం ప్రకారం.. బయటి వాతావరణ ఉష్ణోగ్రత కంటే మీ ఏసీ టెంపరేచర్‌ను గరిష్టంగా 20 డిగ్రీల ఫారెన్‌హీట్ (దాదాపు 11 డిగ్రీల సెల్సియస్) కంటే తక్కువకు సెట్ చేయకూడదు. ఉదా: బయట ఎండ 95 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటే.. మీ ఏసీని 75 డిగ్రీల కంటే తక్కువకు తగ్గించకూడదు. అంతకంటే తక్కువకు సెట్ చేస్తే రూమ్ చల్లబడటానికి ఏసీ కంటిన్యూస్‌గా రన్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల కంప్రెషర్‌పై ఒత్తిడి పడి, ఏసీ సరిగ్గా పనిచేయకపోగా అనవసరంగా విద్యుత్ వృథా అవుతుంది.

Advertisement

Also Read: ఏసీ ఉండి కూడా ఇల్లు చల్లబడట్లేదా? అయితే చాలామంది చేసే ఈ 5 తప్పులే కారణం!

ఆగకుండా తిరిగితే వచ్చే నష్టాలు:

సాధారణంగా ఏసీ రోజుకు ఒక 8 గంటలు తిరిగితే వచ్చే బిల్లు కంటే, ఈ నియమం పాటించకుండా రోజంతా ఆన్ చేసి ఉంచితే బిల్లు మూడు రెట్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. కేవలం కరెంట్ బిల్లు మాత్రమే కాదు.. ఏసీ జీవితకాలం కూడా సగానికి పడిపోతుంది. సాధారణంగా సెంట్రల్ ఏసీలు 15 నుండి 20 ఏళ్లు, విండో ఏసీలు 8 నుండి 10 ఏళ్లు మన్నుతాయి. కానీ నిరంతరం వాడటం వల్ల ఏసీ విడిభాగాలు త్వరగా పాడైపోయి, రిపేర్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది.

ఫ్యాన్ల సాయం తీసుకోవాలి:

Advertisement

కేవలం ఏసీ మీదే భారం వేయకుండా ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్లు లేదా పోర్టబుల్ ఫ్యాన్లను వాడటం మంచిది. గదిలో గాలి స్తంభించిపోవడం వల్లే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఫ్యాన్ ఆన్ చేయడం ద్వారా గదిలో గాలి ప్రసరణ జరిగి, ఉష్ణోగ్రత మారకపోయినా శరీరం చల్లగా అనిపిస్తుంది. ఇది ఏసీకి అదనపు సాయంలా పనిచేస్తుంది.

ఇతర మార్గాల ద్వారా:

సూర్యరశ్మి నేరుగా ఇంట్లోకి రాకుండా కిటికీలకు మందపాటి తెరలు వేయడం ద్వారా వేడిని చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే ఇంట్లో అనవసరంగా వెలిగే లైట్లు, టీవీలు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల కూడా కొంత వేడి పుడుతుంది. అవసరం లేనప్పుడు వాటిని ఆపివేయడం వల్ల గది చల్లగా ఉంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఏసీపై భారం తగ్గి, కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.

Also Read: ఇక ఏసీ గాలి నేరుగా ఒంటికి తగలదు..: శాంసంగ్ తెచ్చిన ఈ సరికొత్త AI ఏసీ చూశారా?

Related News

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

Big Stories

Advertisement
×