E-Paper
Advertisement

గేమర్లకి డ్రీమ్ ల్యాప్‌టాప్..భారీ పవర్,సరికొత్త ఫీచర్లు

గేమర్లకి డ్రీమ్ ల్యాప్‌టాప్..భారీ పవర్,సరికొత్త ఫీచర్లు
Advertisement

Dell Alienware 15:  హార్డ్‌కోర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు డెల్ ఏలియన్‌వేర్. ఈ లైనప్‌లో సరి కొత్తగా వచ్చిన ఈ మోడల్ ల్యాప్‌టాప్ మార్కెట్లో.. తీవ్ర దుమారం రేపుతోంది. కిల్లర్ పెర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్ విజువల్స్ , ఐకానిక్ సైన్స్-ఫిక్షన్ డిజైన్‌తో గేమింగ్ లవర్స్ ను పిచ్చెక్కించేలా రూపుదిద్దుకుంది. అయితే.. ఈ మాన్‌స్టర్ డివైజ్‌లో ఊహించని చిన్న లోపం కూడా ఉంది. ఈ ఫుల్ రివ్యూలో ఈ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు స్పష్టంగా తెలుసుకుందాం!

Dell Alienware 15 (2026)రివ్యూ

ఫ్యూచరిస్టిక్ డిజైన్ , డిస్‌ప్లే క్వాలిటీ:

డెల్ ఏలియన్‌వేర్ 15 చూడటానికి ఒక స్పేస్‌షిప్‌లా ఎంతో గ్రాండ్‌గా, ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. దీని సిగ్నేచర్ ఆనోడైజ్డ్ అల్యూమినియం ఛాసిస్ , RGB లైటింగ్ గేమింగ్ వైబ్స్‌ను పీక్స్‌కి తీసుకెళ్తాయి. ఇందులో.. 15.6-ఇంచుల QHD+ OLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 240Hz రీఫ్రెష్ రేట్ , 0.2ms రెస్పాన్స్ టైమ్‌తో వస్తుంది. ఆటలు ఆడేటప్పుడు రే-ట్రేసింగ్ విజువల్స్, డార్క్ సీన్స్ ఎంతో స్పష్టంగా, వివిడ్‌గా కనిపిస్తాయి. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే.. వారికి ఈ స్క్రీన్ బెస్ట్ అనే చెప్పాలి.

Advertisement

తుఫాన్ పెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్:

ఈ ల్యాప్‌టాప్ లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రా / రైజెన్ 9 ప్రాసెసర్‌తో పాటు ఎన్విడియా జెఫోర్స్ RTX 4080 (లేదా RTX 50 సిరీస్) GPUతో వస్తుంది. దాంతో 4కే గేమింగ్, సైబర్‌పంక్, కాల్ ఆఫ్ డ్యూటీ, జీటీఏ వంటి హెవీ గ్రాఫిక్ గేమ్‌లను గరిష్ట సెట్టింగ్స్‌లో ఎలాంటి లాగ్ లేకుండా 60+ FPSతో రన్ చేయెచ్చు. 32GB DDR5 రామ్, 2TB NVMe SSD స్టోరేజ్ వల్ల మల్టీ టాస్కింగ్, వీడియో ఎడిటింగ్ , 3D రెండరింగ్ క్షణాల్లో పూర్తవుతాయి.

అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్:

Advertisement

హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ల్యాప్‌టాప్ వేడెక్కకుండా డెల్ ఇందులో ప్రత్యేకమైన ‘ఎలిమెంట్ 31’ వేపర్ ఛాంబర్ , క్వాడ్-ఫ్యాన్ క్రియో-టెక్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది ఎంత గంటలు గేమింగ్ ఆడినా సిస్టమ్‌ను చల్లగా ఉంచుతుంది. బటన్ ప్రెస్ చేయగానే ల్యాప్‌ టాప్ టర్బో మోడ్‌లోకి వెళ్లి ఫ్యాన్ స్పీడ్ పెంచి హీట్‌ను త్వరగా బయటకు పంపేస్తుంది.

అన్ని రంగాల్లో.. నంబర్ వన్‌గా ఉన్న ఈ ల్యాప్‌ టాప్‌లో రెండు ప్రధాన లోపాలు ఉన్నాయి. మొదటిది పోర్టబిలిటీ, బరువు. ఇది దాదాపు 2.8 కేజీల బరువుంటుంది. దానికి తోడు భారీ ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది. ప్రతి రోజూ బ్యాగ్‌లో పెట్టుకుని ఆఫీస్ లేదా కాలేజీకి మోసుకెళ్లడం చాలా కష్టం. రెండోది బ్యాటరీ లైఫ్. కేవలం గేమింగ్, బ్రౌజింగ్ లేదా నార్మల్ పనులకే.. వాడినా బ్యాటరీ కష్టమీద 3 నుంచి 4 గంటలు మాత్రమే వస్తుంది. గేమ్స్ ఆడాలంటే.. తప్పనిసరిగా ఛార్జర్ ప్లగ్ చేసి ఉంచాల్సిందే.

Also Read: పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

కీబోర్డ్, ఆడియో ,స్మార్ట్ ఫీచర్లు:

ఇందులో చెర్రీ ఎమ్‌ఎక్స్ మెకానికల్ లో-ప్రొఫైల్ కీబోర్డ్ ఇచ్చారు. ప్రతి కీ ప్రెస్ చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ స్పీకర్ల ఆడియో క్వాలిటీ చాలా లౌడ్‌గా, బేస్‌తో అద్భుతంగా .. ఉంటుంది. వైఫై 7, బ్లూటూత్ 5.4 , అన్ని రకాల హై-స్పీడ్ పోర్టులు ఇందులో లభిస్తాయి.

ధర :

డెల్ ఏలియన్‌వేర్ 15 (2026) ఇండియన్ మార్కెట్లో వేరియంట్‌ను బట్టి సుమారు రూ. 2,49,990 నుంచి రూ. 3,10,000 ధరల పరిధిలో అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం కేటగిరీకి చెందిన హై-ఎండ్ గేమింగ్ మెషిన్.

మీ బడ్జెట్‌కు ఎలాంటి లిమిట్ లేకపోతే.. బరువుతో పని లేకుండా ఒకే చోట కూర్చుని అల్టిమేట్ డెస్క్‌ టాప్ లెవెల్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఆస్వాదించాలనుకుంటే ఈ మోడల్ బెస్ట్ ఛాయిస్. కానీ, ట్రావెలింగ్ కోసం తక్కువ బరువున్న ల్యాప్‌టాప్ , రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి అంతగా ఉపయోగపడదు.

Related News

రూ.499 లకే..40 గంటల ప్లేబ్యాక్ స్మార్ట్ ఇయర్‌బడ్స్, డోంట్ మిస్

ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ..ఇలాంటి గాడ్జెట్ తప్పకుండా ఉండాల్సిందే!

ప్రీమియం వాషింగ్ మెషీన్లపై సూపర్ ఆఫర్లు..బెస్ట్ 5 డీల్స్ ఇవే!

ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సేవ్ చేయడానికి పాటించాల్సిన 5 రూల్స్!

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

Big Stories

Advertisement
×