E-Paper
Advertisement

ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ..ఇలాంటి గాడ్జెట్ తప్పకుండా ఉండాల్సిందే!

ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ..ఇలాంటి గాడ్జెట్ తప్పకుండా ఉండాల్సిందే!
Advertisement

Pebble Qore 2 Review: ఇప్పుడున్న స్మార్ట్‌ వాచ్ ప్రపంచంలో స్క్రీన్ల గోల లేకుండా.. కేవలం ఫిట్‌నెస్ వివరాలను ట్రాక్ చేసే కాంపాక్ట్ స్మార్ట్ బ్యాండ్లకి క్రేజ్ మళ్లీ పెరుగుతోంది. ఈ కేటగిరీలోనే.. మార్కెట్లోకి అడుగుపెట్టింది Pebble Qore 2. రూ. 3,799 ఆఫర్ ధరలో లభించే ఈ స్క్రీన్-లెస్ ఫిట్‌నెస్ ట్రాకర్, ఏకంగా 45 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అయితే.. ప్రీమియం మెటాలిక్ లుక్ , ఊహించని బ్యాటరీ లైఫ్‌తో ఆకట్టుకుంటున్న ఈ డివైజ్, హెల్త్ అండ్ యాక్టివిటీ ట్రాకింగ్ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయింది? ఈ రివ్యూలో క్లియర్‌గా చూద్దాం!

Pebble Qore 2 రివ్యూ

ప్రీమియం డిజైన్ , బిల్డ్ క్వాలిటీ:

ఈ మోడల్ చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, క్యూట్‌గా ఉంటుంది. ఇందులో ఎలాంటి డిస్‌ప్లే స్క్రీన్ ఉండదు. దీని బాడీపై భాగం మెటల్‌తో, కింద చర్మానికి తగిలే భాగం ప్లాస్టిక్‌తో రూపోందించబడింది. ఇది చేతికి పెట్టుకున్నప్పుడు చాలా లైట్‌వెయిట్‌గా అనిపిస్తుంది. కాస్మిక్ బ్లాక్, లూనార్ బ్రౌన్ , నెబ్యులా బ్లూ కలర్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. రోజంతా.. పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో వాటర్ రెసిస్టెంట్ 5ATM రేటింగ్ కూడా ఉంది, కాబట్టి చెమట లేదా వర్షానికి పాడవుతుందనే భయం ఉండదు.

అన్-బీటబుల్ బ్యాటరీ లైఫ్:

Advertisement

ఈ డివైజ్ బిగ్గెస్ట్ హైలైట్ దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్! ఇందులో 150mAh బ్యాటరీని అందించారు. ఒకే సారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 45 రోజుల పాటు వస్తుందని కంపెనీ చెప్తోంది. ప్రాక్టికల్ ఉపయోగంలో.. కూడా ఇది ఈజీగా 30 నుంచి 35 రోజుల వరకు నిరంతరాయంగా పని చేస్తుంది. ప్రతి రోజూ లేదా వారానికి ఒకసారి ఛార్జింగ్ పెట్టే.. తలనొప్పి లేకుండా, ఒక్క సారి ఛార్జ్ చేసి నెల మొత్తం హ్యాపీగా వాడేయవచ్చు. పోగో పిన్ ఆధారిత ఛార్జర్ ద్వారా ఇది చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.

హెల్త్ & యాక్టివిటీ ట్రాకింగ్:

ఈ మోడల్ బ్యాటరీ విషయంలో.. ఎంత టాప్ మార్కులు కొట్టేసిందో, హెల్త్ ట్రాకింగ్ విషయంలో అంతగా నిరాశ పరుస్తుంది. ఇందులో హార్ట్ రేట్ , SpO2, హెచ్‌ఆర్‌వి , స్ట్రెస్ , స్లీప్ ట్రాకింగ్ వంటి రకరకాల సెన్సార్లు ఉన్నాయి. హార్ట్ రేట్ , SpO2 రీడింగ్స్ ఓకే అనిపించినా, డెయిలీ స్టెప్ ట్రాకింగ్, క్యాలరీల లెక్కింపులో భారీ తేడాలు ఉన్నాయి. మీరు వేసే అడుగులను, ఖర్చు చేసే క్యాలరీలను.. ఇది చాలా తక్కువగా లెక్కడుతుంది. తీవ్రమైన వర్కౌట్లు చేసే వారికి, కచ్చితమైన డేటా కోరుకునే ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కి ఈ ట్రాకింగ్ రీడింగ్స్ అంతగా ఉపయోగపడవు.

Advertisement

Also Read: పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫీచర్లు , స్మార్ట్ నోటిఫికేషన్లు:

ఈ బ్యాండ్ Pebble Halo యాప్ ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ఇందులో.. సైలెంట్ కాలింగ్, యాప్ నోటిఫికేషన్ అలర్ట్ల కోసం చాలా స్ట్రాంగ్ వైబ్రేషన్ మోటార్ ఇచ్చారు. ఫోన్ రింగ్ అయినప్పుడు వైబ్రేషన్ ద్వారా క్లియర్‌గా నోటిఫికేషన్ అందిస్తుంది. అలాగే దీనిపై ఉన్న ఫిజికల్ బటన్ సహాయంతో.. ఫోన్ కెమెరాను ఆపరేట్ చేసి ఫొటోలు క్లిక్ చేయెచ్చు.

ధర, ఆఫర్లు:

ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ అధికారిక ఎంఆర్‌పి రూ. 5,999 కాగా, ప్రస్తుతం ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలో ఆఫర్ల కింద రూ. 2,999 నుంచి రూ. 3,799 ధరల పరిధిలో అందుబాటులో ఉంది.

మీకు స్క్రీన్లు లేని సింపుల్ ఫిట్‌నెస్ డివైజ్ కావాలి, చార్జింగ్ పెట్టే.. ఓపిక లేదు, ప్రైమరీగా కాల్స్/నోటిఫికేషన్ల వైబ్రేషన్ అలర్ట్లు, స్టైలిష్ లుక్ మాత్రమే చాలు అనుకుంటే.. ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్. కానీ, వర్కౌట్లు, స్టెప్స్, క్యాలరీల కచ్చితమైన వివరాలు ముఖ్యమనుకునే.. వారికి మాత్రం ఈ ట్రాకింగ్ అంతగా నచ్చకపోవచ్చు.

Related News

రూ.499 లకే..40 గంటల ప్లేబ్యాక్ స్మార్ట్ ఇయర్‌బడ్స్, డోంట్ మిస్

గేమర్లకి డ్రీమ్ ల్యాప్‌టాప్..భారీ పవర్,సరికొత్త ఫీచర్లు

ప్రీమియం వాషింగ్ మెషీన్లపై సూపర్ ఆఫర్లు..బెస్ట్ 5 డీల్స్ ఇవే!

ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సేవ్ చేయడానికి పాటించాల్సిన 5 రూల్స్!

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

Big Stories

Advertisement
×