E-Paper
Advertisement

స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో Dell XPS 13 వచ్చేసింది!

స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో Dell XPS 13 వచ్చేసింది!
Advertisement

Dell XPS 13: ప్రముఖ టెక్ దిగ్గజం డెల్ తమ పాపులర్ ల్యాప్‌టాప్ సిరీస్‌లో XPS 13 (2026) కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇచ్చేలా దీనిని రూపొందించారు. గతంలో వచ్చిన మోడల్స్‌తో పోలిస్తే.. దీనిలో పెర్ఫార్మెన్స్ పరంగా ఎన్నో అప్‌గ్రేడ్స్ చేశారు. విద్యార్థులను ఆకట్టుకునేలా భారీ డిస్కౌంట్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

ఆకట్టుకునే డిస్‌ప్లే.. స్లిమ్ డిజైన్:

ఈ కొత్త Dell XPS 13 ల్యాప్‌టాప్ చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉంటుంది. ఇది కేవలం 1 కేజీ బరువు, 12.7 మిమీ మందంతో డెల్ చరిత్రలోనే అత్యంత తేలికైన ల్యాప్‌టాప్‌గా నిలిచింది. దీనిలో 13.4 అంగుళాల 2.5K డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీంతో ఎండలో స్క్రీన్ చూసినా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత స్లిమ్‌గా ఉన్నప్పటికీ.. దీని బాడీ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Advertisement

Also Read: యాపిల్ నుంచి తొలి మడత ఫోన్.. ఐప్యాడ్ లాంటి లుక్, రూ.2 లక్షల ధరతో iPhone Ultra!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే..

Dell XPS 13లో సరికొత్త ఇంటెల్ కోర్ 5 320, కోర్ అల్ట్రా 7 355 ప్రాసెసర్‌లను ఉపయోగించారు. ఇది 4.7GHz క్లాక్ స్పీడ్‌తో పాటు ఏఐ టాస్క్‌ల కోసం 49 TOPS ఎన్‌పీయూ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 32GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ లభిస్తుంది. ల్యాప్‌టాప్ వేడెక్కకుండా ఉండటానికి డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. అలాగే విండోస్ హలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్, క్వాడ్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి.

17 గంటల బ్యాటరీ లైఫ్:

Advertisement

కనెక్టివిటీ కోసం దీనిలో వైఫై 7, బ్లూటూత్ 6.0తో పాటు రెండు యూఎస్‌బీ-సి పోర్టులు ఇచ్చారు. అలాగే దీనిలో 52Wh బ్యాటరీని అందించారు. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 17 గంటల వరకు బ్యాకప్ ఇస్తుందని డెల్ చెప్తోంది. దీనికి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.58,000 కాగా, 16 ఏళ్లు పైబడిన విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ కింద కేవలం రూ.50,000 (పరిమిత కాలం పాటు) లభిస్తుంది.

Also Read: జస్ట్ రూ.1,799కే Itel Aqua వాటర్ ప్రూఫ్ ఫోన్.. అరగంట పాటు నీటిలో ఉన్నా ఏం కాదు!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×