E-Paper
Advertisement

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా
Advertisement

Supreme Court: కారుణ్య నియామకాలకు సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న పెళ్లైన కూతుర్లు అర్హులేనని తేల్చిచెప్పేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే వారి స్థానంలో పెళ్లయిన కూతుళ్లు అర్హులేనని తేల్చిచెప్పేసింది.

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisement

కారుణ్యం ఆధారంగా జీవించే తనకు ఫెయిర్ ప్రైస్‌ షాప్ డీలర్ లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ ఓ మహిళా అలహాబాద్ హైకోర్టు తలుపు తట్టింది. అయితే ఆ మహిళకు వివాహం కావడంతో పక్కనపెడుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

తనకు వివాహం జరిగిన నుంచి దివ్యాంగురాలైన సోదరి, తల్లితో కలిసి ఆ షాపు నిర్వహించినట్లు పేర్కొంది. అయితే తల్లి మరణం తర్వాత లైసెన్స్‌కు దరఖాస్తు చేయగా అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వం ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. తాజాగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టేసింది.

Advertisement

పెళ్లయిన కూతుర్లు అర్హులే -సుప్రీంకోర్టు

ఆమెకు లైసెన్స్ నిరాకరిస్తూ జారీ చేసిన ఆదేశాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. నాలుగు వారాల్లో సదరు మహిళకు లైసెన్స్ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. వివాహం జరిగినా తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న కూతుళ్లకు తాజాగా తీర్పు ద్వారా సుప్రీంకోర్టు భారీ ఊరట ఇచ్చింది.

అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా అనుకోకుండా మృతి చెందితే వారి స్థానంలో ఇచ్చే కారుణ్య నియామకాలకు పెళ్లయిన కూతుళ్లు అర్హులేనని తీర్పునిచ్చింది. పెళ్లి అయిందనే ఒక్క కారణంతో మహిళల హక్కులను కాలరాయలేరని స్పష్టం చేసింది.

ALSO READ: ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

ఉద్యోగంలో ఉండగా తల్లిదండ్రులు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కారుణ్య నియామకాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. చాలా ప్రభుత్వాలు కేవలం కొడుకులు, వివాహం కాని అమ్మాయిలు అవకాశం కల్పించాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పుతో దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు న్యాయం జరగనుంది.

Related News

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

Big Stories

Advertisement
×