E-Paper
Advertisement

Air Coolers: డెజర్ట్ vs పర్సనల్ vs టవర్.. మధ్యతరగతి ప్రజలు.. ఏ కూలర్ కొంటే బెటర్?

Air Coolers: డెజర్ట్ vs పర్సనల్ vs టవర్.. మధ్యతరగతి ప్రజలు.. ఏ కూలర్ కొంటే బెటర్?
Advertisement

Air Coolers: సమ్మర్ లో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కూలర్లను కొనుగోలు చేస్తుంటారు. ఏసీలను కొనే ఆర్థిక స్థోమత లేని వారు సైతం చల్లదనం కోసం తక్కువ బడ్జెట్ లో లభించే కూలర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే గది పరిమాణం, డిజైన్ ను బట్టి ప్రస్తుతం మార్కెట్ లో మూడు రకాల కూలర్లు అందుబాటులో ఉన్నాయి. డెజర్ట్, పర్సనల్, టవర్ కూలర్ల రూపంలో అవి లభిస్తున్నాయి. అయితే పనితీరు పరంగా వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటి? విద్యుత్ ఆదా పరంగా సామాన్యుల ఇంటికి ఏది ఉత్తమమో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డెజర్ట్ కూలర్లు (Desert Coolers)

ఈ కూలర్లను పెద్ద గదులు, హాల్స్ కోసం రూపొందించారు. ఇవి చాలా శక్తివంతంగా ఉంటూ బయటి నుంచి వేడి గాలిని తీసుకొని చల్లగా మార్చి గదిలోకి పంపిస్తాయి. డెజర్ట్ కూలర్లలో ఫ్యాన్లు పెద్దగా ఉండటంతో పాటు ఎక్కువ నీటిని నిల్వ చేయగల ట్యాంకులను కలిగి ఉంటాయి.

పర్సనల్ కూలర్లు (Personal Coolers)

Advertisement

ఇవి చిన్నగదులు, ఒక వ్యక్తికి మాత్రమే కూలింగ్ ను అందిస్తాయి. తక్కువ శబ్దంతో ఇవి పవిచేస్తాయి. వీటి పరిమాణం, సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల.. బెడ్‌రూమ్‌లు, స్టడీ రూమ్స్ అనువైనవిగా ఉంటాయి. ఇవి చిన్న సైజ్ లో ఉండటం వల్ల వీటిని ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తరలించవచ్చు.

టవర్ కూలర్లు (Tower Coolers)

ఈ కూలర్లు.. నిలువుగా ఉండి తక్కువ స్థలాన్ని ఆక్యుపై చేస్తాయి. పై రెండింటితో పోలిస్తే వీటి లుక్, డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. తక్కువ స్థలం ఉన్న గదులకు, ఆఫీసు క్యాబిన్లకు ఇది అనువైనదిగా ఉంటుంది. ఇతర కూలర్ల తరహాలో కాకుండా వీటిలో ఫ్యాన్‌కు బదులు ‘బ్లోయర్లు’ (Blowers) వాడతారు.

Advertisement

Also Read: Smart Meter: ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్‌కు.. కొత్త ఫోన్ నెంబర్ యాడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అయితే సరి!

విద్యుత్ ఆదాకు ఏది బెస్ట్?

ఎయిర్ కూలర్లు ఏ మోడల్ కు చెందినప్పటికీ.. విద్యుత్ ఖర్చు అనేది వాటిలోని మోటార్ సామర్థ్యం, ఫ్యాన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి డిజెర్ట్ కూలర్లు అధికంగా విద్యుత్ ను వినియోగిస్తాయి. వాటి తర్వాత విద్యుత్ ఖర్చులో టవర్ కూలర్లు రెండో స్థానంలో నిలుస్తాయి. విద్యుత్ ఆదా చేయాలనుకునే వారికి చిన్న గదుల్లో పర్సనల్ కూలర్లు ఉత్తమమైన ఎంపికగా నిలుస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Summer Tips: మీ ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయా? ఈ తేలికైన టిప్స్ పాటిస్తే.. వేసవిలోనూ కూల్‌గా ఉండొచ్చు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×