E-Paper
Advertisement

Smart Meter: ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్‌కు.. కొత్త ఫోన్ నెంబర్ యాడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అయితే సరి!

Smart Meter: ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్‌కు.. కొత్త ఫోన్ నెంబర్ యాడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అయితే సరి!
Advertisement

Smart Meter: విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను అమరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెున్నటి వరకూ ఈ విద్యుత్ మీటర్లకు కొత్త మెుబైల్ నెంబర్ ను కనెక్ట్ చేసేందుకు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను విద్యుత్ శాఖ మరింత సులభతరం చేసింది. ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ లో మెుబైల్ నెంబర్ ను యాడ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

మొబైల్ యాప్ ద్వారా..

మెుబైల్ యాప్ ను ఉపయోగించి మీ స్మార్ట్ విద్యుత్ మీటర్ కు కొత్త మెుబైల్ నెంబర్ ను యాడ్ చేయవచ్చు. అయితే ఇందుకోసం మీ విద్యుత్ సరఫరా సంస్థ (TGSPDCL, APEPDCL, UPPCL) కు చెందిన అధికారిక యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ కస్టమర్ ఐడి లేదా సర్వీస్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.

ఓటీపీ ఎంటర్ చేస్తే సరి..

Advertisement

అనంతరం యాప్ లోని ప్రొఫైల్ సెట్టింగ్స్ (Profile Settings) లేదా మేనేజ్ మెంట్ (Manage Account) విభాగంలోకి వెళ్లి అక్కడ ఉన్న మెుబైల్ నెంబర్ (Mobile Number) ఆప్షన్ పై క్లిక్ చేసి ఎడిట్ చేయండి. కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే దానికి ఒక OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ నంబర్ అప్‌డేట్ అవుతుంది.

అధికారిక వెబ్‌సైట్ అయితే..

యాప్ ద్వారా కుదరకపోతే అధికారిక వెబ్ సైట్ సాయంతో కూడా మీ నెంబర్ ను అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ డిస్కం (DISCOM) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి (ఉదాహరణకు tgspdcl.cgg.gov.in). యధావిధిగా మీ యూజర్ ఐడీ, పాస్ వార్డ్ తో లాగిన్ అవ్వండి.

అప్డేట్ మెుబైల్ నెంబర్..

Advertisement

వెబ్ సైట్ లాగిన్ అయిన తర్వాత కంజ్యూమర్ డాష్ బోర్డ్ లేదా ప్రొఫైల్ విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అప్డేట్ మెుబైల్ నెంబర్ (Update Mobile Number) అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ కొత్త నెంబర్ ను ఎంటర్ చేయండి. అనంతరం వచ్చే ఓటీపీ నెంబర్ తో కొత్త నెంబర్ ను కన్ఫార్మ్ చేయండి. దీంతో పాత నెంబర్ స్థానంలో మీ కొత్త నెంబర్ స్మార్ట్ విద్యుత్ మీటర్ కు యాడ్ అవుతుంది.

ఆఫ్ లైన్‌లో చేయాలంటే..

యాప్, వెబ్ సైట్ లో కుదరని పక్షంలో ఆఫ్ లైన్ లోనూ మీ కొత్త మెుబైల్ నెంబర్ ను యాడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా విద్యుత్ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 1912ను సంప్రదించి మార్చుకోవచ్చు. లేదంటే దగ్గరలోని మీ సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి వెళ్లి అప్లికేషన్ ఇవ్వడం ద్వారా నంబర్ మార్చుకోవచ్చు.

Also Read: Summer Tips: మీ ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయా? ఈ తేలికైన టిప్స్ పాటిస్తే.. వేసవిలోనూ కూల్‌గా ఉండొచ్చు!

లింక్ చేస్తే లాభామేంటి?

ప్రస్తుతం మీరు వాడుతున్న మెుబైల్ నెంబర్ ను స్మార్ట్ మీటర్ కు లింకప్ చేయడం ద్వారా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీ మీటర్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది. మీరు రీఛార్జ్ చేసిన వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ సైతం వస్తుంది. ఒక వేళ మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత, మరమ్మతుల సమాచారం ముందే అందుతుంది. తద్వారా మీరు అలర్ట్ అవ్వవచ్చు.

Also Read: టోవినో థామస్ ‘రక్షకుడా’ లేక ‘రొటీన్’ డ్రామాకు నాయకుడా?.. ‘పల్లిచట్టంబి’ రివ్యూ..

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×