E-Paper
Advertisement

Air Force Recruitment Rally: తెలుగు యువతకు గుడ్ న్యూస్.. భారత వాయుసేనలో చేరే సువర్ణవకాశం!

Air Force Recruitment Rally: తెలుగు యువతకు గుడ్ న్యూస్.. భారత వాయుసేనలో చేరే సువర్ణవకాశం!
Advertisement

Air Force Recruitment Rally: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా, పురుష అభ్యర్థులకు భారత వైమానిక దళం గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ మార్చి 9న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏపీలోని గుంటూరుకు సమీపంలో గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ రిక్రూట్ మెంట్ ప్రారంభమవుతుందని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (నియామకాల భర్తీ) అధికారి, సికింద్రాబాద్ 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు.

ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి

రెండు తెలుగు రాష్ట్రాల యువతకు భారతీయ వాయు సేనలో జాయిన్ అవ్వడానికి ఈ ర్యాలీ ద్వారా సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు షేక్ యాకూబ్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 9, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులకు.. 12, 13 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు ర్యాలీ జరగనుంది. అలాగే 15, 16 తేదీల్లో తెలంగాణ పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యోగ అర్హతలు..

Advertisement

17 నుంచి 21ఏళ్ల వయసుగల అవివాహిత యువతీ, యువకులు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీకి అర్హులనీ షేక్ యాకూబ్ అలీ అన్నారు. జూలై 2, 2005 నుంచి జనవరి 2, 2009 తేదీ మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. కనీస ఎత్తు 152 సెం.మీ తప్పనిసరి. విద్యార్హత విషయాలకు వస్తే ఇంటర్, పాలిటెక్నిక్, రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో (ఐటీఐ) ఉత్తీర్ణత సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఆయా విద్యార్హతల్లో మొత్తం మార్కుల్లో 50 శాతంతో పాటు ఇంగ్లీషులో 50 శాతం స్కోరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోనవసరం లేదు. నేరుగా ర్యాలీకి హాజరుకావొచ్చు. ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధ్రువపర్చిన విద్యార్హత ధ్రువ పత్రాలు, డొమిసైల్ సర్టిపికిట్, NCC సర్టిఫికెట్ (ఉంటే), ఆధార్ కార్డు, ఇటీవల తీసుకున్న 10 పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు, ప్రతి ధ్రువపత్రానికి సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలన్నారు.

Also Read: Leader Teaser: శరవరణ్ ‘లీడర్’ టీజర్ వచ్చేసింది చూశారా?.. కూతురు సెంటిమెంట్ అదిరిందిగా..

శారీరక పరీక్షల్లో పాస్ అయితేనే..

Advertisement

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా అభ్యర్థులు మార్చి 9న, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు 12న, తెలంగాణ పురుష అభ్యర్థులు 15న ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో హాజరుకావాలని కోరారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా, పురుష అభ్యర్థులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం https:// agnipathvayu.cdac.inను సందర్శించాలని సూచించారు.

Also Read: Prison Drama OTT : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×