Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టు లుగా ఎంతోమంది తమ అద్భుతమైన నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంటారు. అయితే జీవితంలో కొన్ని అత్యంత కీలకమైన ఘట్టాల కోసం ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి ఉంటుంది. కొంతమంది పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైతే.. మరి కొంతమంది సరైన హిట్టు లేక అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమవుతారు..ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మళ్ళీ సక్సెస్ దిశగా అడుగులు వేయాలని చూస్తారు.
అందులో భాగంగానే ఒకప్పుడు తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి ఎనిమిది భాషల్లో సుమారుగా 100కు పైగా చిత్రాలలో హీరోయిన్గా నటించి బహుభాషా నటిగా పేరు సొంతం చేసుకుంది చిరంజీవి బ్యూటీ అలియాస్ రంభ.. 1991లో సర్గం అనే మళయాల చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తన మాతృభాష అయిన తెలుగులో ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ..ఆ తర్వాత మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. అలా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, భోజ్పురి, బెంగాలీ ఇలా దాదాపు 8 భాషలలో నటించి పేరు గడించింది. ఇక తెలుగులో చిరంజీవి , వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈమె.. తెలుగులో రజనీకాంత్ , కమలహాసన్, అర్జున్ వంటి హీరోలతో జతకట్టింది . నిర్మాతగా కూడా అవతరించిన రంభ కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.
హీరోయిన్ గా కెరియర్లో ఫుల్ ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఈమె పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ తన జీవితాన్ని వైవాహిక బంధానికే పరిమితం చేసింది. అలా పదహారేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రంభ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ కోసం కుస్తీ పడుతోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని.. అందులో భాగంగానే చెన్నైకి చేరుకుందని , ప్రస్తుతం సినిమాలలో అవకాశాల వేట మొదలుపెట్టిందనే కామెంట్లు కోలీవుడ్ మీడియాలలో ప్రథమంగా వినిపిస్తున్నాయి.
ALSO READ:Film industry: బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డ ‘సేక్రేడ్ గేమ్స్’ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
ప్రస్తుతం రంభ వయసు 49 సంవత్సరాలు. శారీరక వ్యాయామాలు చేసి బరువు తగ్గి ఇప్పుడు కొత్త అందాలను ప్రదర్శిస్తుంది. సినిమా అవకాశాలు వచ్చేవరకు ఇంటిపట్టునే ఉంటూ ఎదురు చూడకుండా అటు దర్శక నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో ఒక్కో అవకాశం సంపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ..త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. మొత్తానికైతే రీ ఎంట్రీ కోసం గట్టిగానే కుస్తీ పడుతున్న ఈ ముద్దుగుమ్మ ..ఇప్పుడు అవకాశాలు అందుకున్నట్లు సమాచారం. మరి రీ ఎంట్రీలో మళ్లీ ఫామ్ లోకి రావాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.