E-Paper
Advertisement

Vivo X300s: 200MP కెమెరా, 7100mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. ఫుల్ ఫీచర్స్ ఇవే

Vivo X300s: 200MP కెమెరా, 7100mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. ఫుల్ ఫీచర్స్ ఇవే
Advertisement

Vivo X300s| వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో X300s త్వరలో మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో వచ్చే వారం లాంచ్ అవుతుంది. ఇప్పటికే చాలా టీజర్లు, లీకులు దీని ముఖ్య స్పెసిఫికేషన్లను బయటపెట్టాయి. 200MP కెమెరా, భారీ 7100mAh బ్యాటరీతో ఈ ఫోన్ బలమైన పర్‌ఫామెన్స్ ఇవ్వనుంది. లాంచ్ వివరాలు, ఫీచర్లు,స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

లాంచ్ తేదీ, లభ్యత

వివో X300sను మార్చి 30న చైనాలో జరగబోయే ఒక టెక్ ఈవెంట్‌లో లాంచ్ కానుంది. ఈ ఈవెంట్‌లో వివో X300 అల్ట్రా, వివో ప్యాడ్ 6 ప్రో కూడా ప్రవేశపెడతారు. ఫోన్ ఇప్పటికే చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. వివో అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడింది. స్టైలిష్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో లభ్యం కావచ్చు.

X300s వేరియంట్స్, స్టోరేజ్ ఆప్షన్లు

Advertisement

వివో X300s మల్టీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. బేస్ మోడల్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉండవచ్చు. మరో ఆప్షన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్. హైయర్ మోడల్స్‌లో 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ లేదా టాప్ వేరియంట్‌లో 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ ఉండవచ్చు. ఈ వేరియంట్లు వివిధ రకాల వినియోగదారుల అవసరాలకు సరిపోతాయి.

డిస్‌ప్లే, డిజైన్

వివో X300sలో 6.78 ఇంచుల పెద్ద డిస్‌ప్లే ఉంటుంది. BOE Q10+ ఫ్లాట్ స్క్రీన్ ప్యానెల్ ఉపయోగించవచ్చు. 1.5K రిజల్యూషన్‌తో స్పష్టమైన ఫొటోలు, వీడియోలు ఇస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్‌ చాలా స్మూత్‌గా ఉంటుంది. డిజైన్ ఆధునికంగా, ప్రీమియం లుక్ ఇస్తుంది.

పర్‌ఫామెన్స్, సెక్యూరిటీ

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ బలమైన హార్డ్‌వేర్‌తో పని చేస్తుంది. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండవచ్చు. ఇది వేగంగా, సురక్షితంగా అన్‌లాక్ చేస్తుంది. మల్టీటాస్కింగ్‌ను సులభంగా నిర్వహించగలదు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌తో పవర్‌ఫుల్ పనితీరు ఆశిస్తున్నారు.

కెమెరా ఫీచర్లు

వివో X300s పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వెనుక భాగంలో 200MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 50MP పెరిస్కోప్ కెమెరా జూమ్ ఫోటోగ్రఫీకి సహాయపడతాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫీచర్లు అధిక క్వాలిటీ గల ఫోటోలు, వీడియోలు ఇస్తాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

ఫోన్‌లో 7,100mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా సేపు ఉపయోగించవచ్చు. 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 40W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉండవచ్చు. ఇవి వేగవంతమైన, సౌకర్యవంతమైన ఛార్జింగ్ ఇస్తాయి.

Also Read: అదుపు తప్పిన రోబో.. హెటల్‌లో టేబుల్స్, ప్లేట్లు పగలగొట్టి డ్యాన్స్.. ఏం జరిగిందంటే

డ్యూరబిలిటీ, అదనపు ఫీచర్లు

X300s IP68, IP69 రేటింగ్స్‌తో వస్తుంది. దుమ్ము, నీటి నుంచి ఫ్రొటెక్షన్ ఫీచర్స్ ఉన్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మంచి సౌండ్ ఇస్తాయి. X-యాక్సిస్ మోటార్ వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్‌ను మెరుగుపరుస్తుంది. USB 3.2 పోర్ట్ ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్‌కు సహాయపడుతుంది.

వివో X300s బలమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ కానుంది. పవర్‌ఫుల్ కెమెరా, భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే ఫీచర్లు ఇస్తుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో బాగా పోటీ పడుతుంది. అధికారిక లాంచ్‌లో ధరతో పాటు మరిన్ని వివరాలు తెలుస్తాయి

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×