E-Paper
Advertisement

Dishwasher vs Hand Washing: అంట్లు తోమడానికి .. రెండింటిలో ఏది బెస్ట్.. పైచేయి మనిషిదా? మిషన్‌దా?

Dishwasher vs Hand Washing: అంట్లు తోమడానికి .. రెండింటిలో ఏది బెస్ట్.. పైచేయి మనిషిదా? మిషన్‌దా?
Advertisement

Dishwasher vs Hand Washing: వంటగదిలో వచ్చి పడే అంట్లను కడిగేందుకు ప్రస్తుత రోజుల్లో రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సంప్రదాయంగా వస్తున్న చేత్తో తోమడం కాగా, రెండోది సాంకేతికతను ఉపయోగించి కడిగే డిష్ వాషర్. అయితే గిన్నెలు కడగడానికి రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందన్న దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండింటికి మధ్య వ్యత్యాసాలు, దేని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

నీటి వినియోగం

ఆధునిక డిష్ వాషర్లు ఒక పూర్తి లోడ్ ను శుభ్రం చేయడానికి 10-15 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తాయి. ఇవి నీటిని రీసైకిల్ చేస్తూ గిన్నెలను శుభ్రపరుస్తాయి. అదే చేత్తో అంట్లు తోమేటప్పుడు కొందరు కుళాయిని ధారగా వదిలేస్తుంటారు. ఫలితంగా ఒక ట్రిప్ అంట్లు తోమడానికి 40-100 లీటర్ల వరకూ నీటిని ఖర్చుచేస్తుంటారు. నీటి ఆదా పరంగా డిష్ వాషర్ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

వేడి నీటితో వాషింగ్..

Advertisement

సాధారణంగా మెజారిటీ డిష్ వాషర్లు 60-70 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీటితో గిన్నెలను శుభ్రపరుస్తాయి. దీనివల్ల అంట్లకు ఉన్న మెుండి జిడ్డు, మాడిన మరకలు త్వరగా వదిలిపోతాయి. చేత్తో కడిగడం విషయానికి వస్తే.. చాలా మంది చన్నీళ్లతోనే గిన్నెలు తోముతుంటారు. ఫలితంగా జిడ్డు, నూనె మరకలు వదిలించడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.

విద్యుత్ ఖర్చు

డిష్ వాషర్ లు విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. నీటిని 60-70 డిగ్రీల వరకూ వేడి చేయడానికి కరెంటును ఉపయోగిస్తాయి. అలాగే లోపల రీసైకిల్ కోసం కూడా విద్యుత్ ఖర్చు అవుతుంది. దీంతో ప్రతీనెల కొంతమేర పవర్ బిల్లు పెరుగుతుంది. అయితే చేత్తో తోమడానికి ఎలాంటి విద్యుత్ అవసరం ఉండదు. పవర్ బిల్లు పరంగా చూస్తే ఇది బెటర్ ఆప్షన్ గా నిలుస్తుంది.

ఆరోగ్యం, పరిశుభ్రత

Advertisement

డిష్ వాషర్లు అధిక ఉష్ణోగ్రత వద్ద నీటిని వాడటం వల్ల 99.9% వరకూ బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది చేత్తో కడగడం కంటే చాలా పరిశుభ్రమైనదిగా చెప్పవచ్చు. మరోవైపు ఆడవారు స్పాంజ్‌లు లేదా పీచులలో అంట్లు తోముతుంటారు. దీనివల్ల గిన్నెలపై ఉన్న బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో తొలగిపోతుందని చెప్పలేం. అలాగని డిష్ వాషర్ తరహాలో అత్యంత వేడి నీటిని ఉపయోగించి చేతులతో గిన్నెలు తోమడమంటే సాధ్యమయ్యే పనికాదు.

Also Read: Budget Dishwashers Under 20000: తక్కువ బడ్జెట్‌లో.. ట్రెండింగ్ డిష్ వాషర్లు.. ఫీచర్లు, లాభాలు ఇవే!

సమయం పరంగా..

డిష్ వాషర్ చాలా వేగంగా గిన్నెలను తోమేస్తాయి. అంట్లను అందులో పెట్టి బటన్ నొక్కితే 10 నిమిషాల వ్యవధిలోనే శుభ్రం చేసేస్తాయి. అంతేకాకుండా డ్రై మోడ్ ఆప్షన్ ద్వారా గిన్నెలను ఆరబెడతాయి కూడా. చేత్తో కడగడానికి వస్తే సగటున ఒక వ్యక్తి రోజుకు 30 నుండి 60 నిమిషాల వరకు గిన్నెలు కడగడానికి కేటాయించాల్సి ఉంటుంది. డిష్ వాషర్ వినియోగం వల్ల ఆ సమయం తగ్గి.. ఇతర పనులు చూసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

Also Read: Dishwasher Benefits: అంట్లు తోమలేకపోతున్నారా? డిష్ వాషర్ కొనేయండి.. బోలెడన్ని ప్రయోజనాలు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×