E-Paper
Advertisement

Dishwasher Benefits: అంట్లు తోమలేకపోతున్నారా? డిష్ వాషర్ కొనేయండి.. బోలెడన్ని ప్రయోజనాలు!

Dishwasher Benefits: అంట్లు తోమలేకపోతున్నారా? డిష్ వాషర్ కొనేయండి.. బోలెడన్ని ప్రయోజనాలు!
Advertisement

Dishwasher Benefits: వంట పాత్రలు తోమే క్రమంలో మహిళలు ఎంతగా కష్టపడతారో అందరికీ తెలిసిందే. ఈ సమస్యకు చెక్ పెడుతూ పలు కంపెనీలకు చెందిన డిష్ వాషర్ మిషన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవీ మనిషి ప్రమేయం లేకుండానే.. గిన్నెలను తోమేస్తాయి. ఈ నేపథ్యంలో వంటగదిలో డిష్ వాషర్ ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

మెరుగైన పరిశుభ్రత

సాధారణంగా చేతిలో అంట్లను తోమే సమయంలో సాధారణ లేదా కుళాయి నీటిని వినియోగిస్తుంటాం. కానీ డిష్ వాషర్ 70°C వరకు ఉండే వేడి నీటిని గిన్నెలు కడగడానికి ఉపయోగిస్తుంది. దీని వల్ల ఆహార పాత్రలపై ఉన్న జిడ్డు సులభంగా వదిలడమే కాకుండా 99 శాతం బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి.

సమయం ఆదా

Advertisement

ఇంట్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే అంట్లు సైతం ఆ స్థాయిలో అధికంగా సింక్ లో వచ్చి పడుతుంటాయి. దీంతో కొందరు మహిళలు నిత్యం అంట్లు తోమడంలోనే గడిపేస్తుంటారు. డిష్ వాషర్ ను కొనుగోలు చేయడం ద్వారా ఆ శ్రమ తగ్గుతుంది. గిన్నెలను డిష్ వాషర్ లో అమర్చి ఒకసారి బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా అది క్లీనింగ్ ప్రక్రియను మెుదలు పెట్టేస్తుంది. ఆ సమయంలో మీరు ఇతర పనులు చేసుకోవచ్చు. ఫలితంగా మీ సమయం ఆదా అవుతుంది.

సమ్మర్‌లో నీటి పొదుపు..

సాధారణ రోజులతో పోలిస్తే సమ్మర్ లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో డిష్ వాషర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డిష్ వాషర్లు చాలా పొదుపుగా నీటిని ఖర్చు చేస్తాయి. చేతితో అంట్లు తోమినప్పుడు 60-80 లీటర్ల నీరు ఖర్చు అయితే.. ఒక పూర్తి లోడ్ డిష్ వాషర్ కేవలం 9-12 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తుంది.

చేతుల ఆరోగ్యానికి రక్ష

Advertisement

గిన్నెలు తోమే డిజర్జెంట్లు గాఢమైన కెమికల్స్ తో రూపొందుతాయి. వీటిని ఉపయోగించి రోజూ అంట్లు తోమడం వల్ల ఇది మీ చేతులపై ప్రతీకూలం ప్రభావం చూపొచ్చు. చేతులు గరుకుగా మారిపోవడం, అలర్జీలు రావడం, స్కిన్ సమస్యలు తలెత్తడం వంటివి జరగొచ్చు. డిష్ వాషర్ వాడటం వల్ల మీ చేతులను సురక్షితంగా, సున్నితంగా ఉంచుకోవచ్చు.

Also Read: War Impact on India: భారతీయుల చావుకొచ్చిన యుద్ధం.. పెరగనున్న ధరలు.. మధ్యతరగతిపై ఆర్థిక పిడుగు!

మరకలు, మెుండి జిడ్డు పటాపంచలు..

సాధారణంగా చాలా మంది వేపుళ్లు, ఫ్రైడ్ మసాలా పదార్థాలు ఇష్టంగా తింటుంటారు. ఈ నేపథ్యంలో వీటి తయారీకి ఉపయోగించే కడాయిలు, బాండీలు, ఇతర వంటపాత్రల అడుగు భాగన మాడిన మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని చేతులతో కడగడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో డిష్ వాషర్ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మరకలు లేదా అధికంగా జిడ్డు ఉన్న గిన్నెలను డిష్ వాషర్ లో పెట్టి ఇంటెన్సివ్ మోడ్ ను ఆన్ చేస్తే సులభంగా వాటిని తొలగించేస్తుంది.

Also Read: IND VS ENG 2nd Semi-Final: సెమీస్ కు ముందే టీమిండియాలో అల్లకల్లోలం..సంజుపై నిషేధం, అభిషేక్ పై వేటు

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×