Dreame L40 Ultra AE: ఇంట్లో రోజూ ఊడ్చడం, తుడవడం చాలా మందికి తలనొప్పిగా మారింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఈ పని కూడా చాలా సులభమైంది. తాజాగా Dreame అనే సంస్థ ఇండియాలో L40 Ultra AE, D20 Ultra అనే రెండు కొత్త రోబోట్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి మీరు చెప్పకుండానే మీ ఇంటిని శుభ్రం చేస్తాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పని చేసే ఈ యంత్రాలు ఇంటి పనిని చాలా వరకు తగ్గిస్తాయి.
ఇంట్లో క్లీనింగ్ కోసం రోజూ కష్టపడాల్సిన అవసరాన్ని తగ్గించే స్మార్ట్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రీమీ సంస్థ L40 Ultra AE , D20 Ultra అనే రెండు కొత్త రోబోట్‌లను ఇండియాలో ప్రవేశపెట్టింది. ఇవి పూర్తిగా ఏఐ టెక్నాలజీతో పని చేసి ఇంటిని శుభ్రంగా ఉంచడంలో సహాయ పడతాయి.
ధర:
ఈ రెండు ప్రోడక్ట్స్ లో D20 Ultra ధర సుమారు రూ. 39,999గా ఉండగా.. L40 Ultra AE ధర సుమారు రూ. 59,999గా నిర్ణయించారు. ఈ ధరలతో ఇవి పూర్తి ఏఐ టెక్నాలజీ కలిగిన ప్రోడక్ట్స్‌గా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
ప్రధాన ఫీచర్లు:
బలమైన ధూళి పీల్చే శక్తి:
L40 Ultra AE యంత్రంలో చాలా బలమైన ధూళి పీల్చే శక్తి ఉంది. ఇది నేలపై ఉన్న దుమ్ము, జుట్టు, చిన్న చెత్తను సులభంగా తీసేస్తుంది. D20 Ultra కూడా దుమ్ము, ధూళిని పూర్తిగా మాయం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది.
ఊడ్చడం, తుడవడం ఒకేసారి:
ఈ రెండు యంత్రాలు ఒకేసారి ఊడ్చడం, తుడవడం పనులు చేస్తాయి. దీంతో వేరువేరుగా పని చేయాల్సిన అవసరం ఉండదు. ఇవి మీ రోజువారీ పనిని చాలా సులభం చేస్తాయి.
తెలివైన మ్యాప్ తయారీ:
ఈ యంత్రాలు ఇంటి గదులను గుర్తించి ముందుగా మ్యాప్ తయారు చేస్తాయి. ఆ తర్వాత ఏ ప్రాంతాన్ని ఎలా శుభ్రం చేయాలో నిర్ణయించుకుని పని చేస్తాయి. ఫర్నిచర్, గోడలు వంటి వాటిని తాకకుండా జాగ్రత్తగా కదులుతాయి.
ఆటోమెటిక్ :
ఈ పరికరాలతో వచ్చే ప్రత్యేక కేంద్రం ద్వారా యంత్రం సేకరించిన దుమ్మును తానే ఖాళీ చేస్తుంది. అలాగే తుడిచే భాగాన్ని కడిగి ఆరబెడుతుంది. దీంతో మన చేతితో చేయాల్సిన పని చాలా తగ్గిపోతుంది.
కార్పెట్ గుర్తింపు:
ఇంటి లోపల కార్పెట్ ఉన్న చోట ఈ యంత్రాలు దాన్ని గుర్తించి తుడిచే భాగాన్ని పైకి ఎత్తి ఉంచుతాయి. అలాగే అక్కడ ధూళి పీల్చే శక్తిని పెంచి మరింత శుభ్రంగా చేస్తాయి.
మొబైల్ కంట్రోల్:
ఈ యంత్రాలను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. మీరు ముందుగానే సమయాన్ని సెట్ చేస్తే.. ఆ సమయంలో యంత్రం స్వయంగా పని మొదలు పెడుతుంది. అలాగే వాయిస్ ద్వారా కూడా ఆర్డర్స్ ఇవ్వొచ్చు.
Also Read: కరెంట్ బిల్లుకు చెక్.. 2026లో బెస్ట్ సోలార్ ఏసీలు ఇవే ! ధర, ఫీచర్ల వివరాలు
ఎవరికి బెస్ట్ ?
1. ఉద్యోగం చేసే వారికి
2.పెద్ద ఇళ్లలో ఉండే వారికి
3. పెంపుడు జంతువులు ఉన్న కుటుంబాలకు
4. రోజూ ఇళ్లు శుభ్రం చేసే టైం లేనివారికి
ఈ రోబోట్‌లను ఒకసారి సెట్ చేస్తే.. తరువాత స్వయంగా వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి.
మొత్తం మీద Dreame సంస్థ తీసుకువచ్చిన L40 Ultra AE, D20 Ultra రోబోట్ శుభ్రపరిచే యంత్రాలు ఇంటి పనిని చాలా సులభం చేస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, ఆటోమేటిక్ గా పనిచేయడం వల్ల ఇవి నిజంగా ఇంట్లో పనిమనిషిలా ఉపయోగపడతాయి. ధర కొంచెం ఎక్కువైనా.. సమయం ఆదా చేయాలనుకునే వారికి ఇవి చాలా బాగా సహాయపడతాయి.