E-Paper
Advertisement

Pakistan High Fuel Price: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం..ఆపై బాదుడు, లీటర్ పెట్రోల్ రూ. 300

Pakistan High Fuel Price: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం..ఆపై బాదుడు, లీటర్ పెట్రోల్ రూ. 300
Advertisement

Pakistan High Fuel Price: ఇరాన్ యుద్ధం ప్రభావం ఒక్కో దేశంపై క్రమంగా పడుతోంది. ఈ విషయంలో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంది. ఆ దేశంలో చమురు సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఫలితంగా ప్రజలపై వడ్డన మొదలైంది. ఇంధనంపై సుంకాన్ని లీటరుకు రూ. 100 నుండి మూడు రెట్లు పెంచింది. ఫలితంగా అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి.

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం

Advertisement

కొన్నాళ్లుగా పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితి పడుతూ లేస్తూ ఉంటుంది. దీనికితోడు ఇరాన్ యుద్ధం, ఆపై చమురుపై ఆంక్షలు నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలు ఎక్కడి కక్కడ ఆగిపోయాయి. ఫలితంగా పలు దేశాల్లో చమురు సంక్షోభం మొదలైంది. వివిధ దేశాలు ఆయిల్‌పై ధరలు అమాంతంగా పెంచుతున్నాయి.. పెంచేస్తున్నాయి కూడా.

తాజాగా పాకిస్థాన్ ఇంధనంపై సుంకాన్ని మూడు రెట్లకు పెంచేసింది. యుద్ధానికి ముందు అక్కడ లీటర్ పెట్రోల్, డీజిల్ సుమారు 100 రూపాయలు పైగానే ఉండేది. తాజాగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ విధించిన పన్నుతో లీటర్ పెట్రోల్ ధర రూ.321 లకు చేరింది. డీజిల్ ధర రూ. 335 లకు చేరింది. ఇక 11 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం ధర రూ.2664 పలుకుతోంది.

Advertisement

సంపన్నులు వినియోగించే ఆయిల్‌పై మూడు రెట్లు సుంకం విధింపు

విలాసవంతమైన వాహనాల్లో వాడే అధిక ఆక్టేన్ ఇంధనాన్ని లక్ష్యంగా చేసుకుంది. దీనిద్వారా పెరుగుతున్న ఇంధన ధరలను భర్తీ చేయడానికి ఆ ఆదాయాన్ని ఉపయోగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నెలకు 9 బిలియన్ల రూపాయలు ఆదా అవుతుందని షరీఫ్ ప్రభుత్వం చెబుతున్నమాట. ఈ భారాన్ని దేశంలోని అత్యంత సంపన్న వర్గంపై భారం వేసింది.

ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇంధన ధరలు, ఆర్థిక ఉపశమన చర్యలను సమీక్షించింది. ఈ పెంపు తర్వాత పెట్రోల్ ధరలు లీటరుకు PKR 266.17 నుండి 321.17కు పెరిగింది. అలాగే డీజిల్ ధరలు లీటరుకు PKR 280.86 నుండి PKR 335.86కు పెరిగాయి.

ALSO READ: ఇరాన్ కొత్త స్కెచ్.. ఒక్కో నౌకలపై 18 కోట్లు ట్యాక్స్, ఆయిల్ ధరలు పెరగడం ఖాయం? 

విమానయాన రంగంలో దీని ప్రభావం కనిపించింది. మార్చి 10 కి పెరిగిన జెట్ ఇంధన ధరలకు అనుగుణంగా పాకిస్తాన్ విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచాయి. కరాచీ-లాహోర్, కరాచీ-ఇస్లామాబాద్ వంటి కీలక మార్గాలలో దేశీయ టిక్కెట్ల ధరలు PKR 2,800 నుండి PKR 5,000 వరకు పెరిగిన విషయం తెల్సిందే.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×