E-Paper
Advertisement

Wired earphones: బ్లూటూత్ యుగంలోనూ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌కు తగ్గని క్రేజ్.. అసలు కారణాలు తెలిస్తే?

Wired earphones: బ్లూటూత్ యుగంలోనూ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌కు తగ్గని క్రేజ్.. అసలు కారణాలు తెలిస్తే?

Wired earphones: ఒకసారి పాతరోజుల్లోకి వెళితే.. జేబులో చిక్కుముడి పడ్డ ఇయర్ ఫోన్ వైర్లను విడదీయడం ఓ పెద్ద యుద్ధంలా అనిపించేది. అప్పట్లో చాలామంది వైర్డ్‌ ఇయర్‌ ఫోన్స్‌ను వాడేవారు. ఎప్పుడైతే యాపిల్ తన ఐఫోన్ నుండి హెడ్‌ఫోన్ జాక్ తీసేసి ఎయిర్‌పాడ్స్‌ను పరిచయం చేసిందో, ఇక వైర్డ్ ఇయర్ ఫోన్స్ శకం ముగిసిపోయిందని అందరం ఫిక్స్ అయిపోయాం.

కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు సీన్ మళ్లీ మొదటికి వస్తోంది. చేతిలో లేటెస్ట్ ఐఫోన్ ఉన్నా, చెవులకు మాత్రం పాతకాలపు వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ తగిలించుకుని తిరగడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇది కేవలం సౌకర్యం కోసమో, తక్కువ ధర అని కాదు.. గ్లోబల్ లెవల్‌లో సెలబ్రిటీల నుండి కాలేజీ స్టూడెంట్ల వరకు ఈ వైర్డ్ ఇయర్ ఫోన్లనే ఇష్టపడుతున్నారు.

బ్లూటూత్ గ్యాడ్జెట్లు రాజ్యం ఏలుతున్న నేటి కాలంలో కూడా ఈ వైర్డ్ విప్లవం మళ్లీ ఎందుకు మొదలైంది? బ్లూటూత్ బడ్స్ కంటే ఆ పాతకాలపు ఇయర్‌‌ఫోన్లలో యువతకు కనిపిస్తున్న మ్యాజిక్ ఏంటి? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఛార్జింగ్ తలనొప్పులు ఉండవు:

మనం ఇప్పటికే స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్ ఇలా రకరకాల పరికరాలను వాడుతున్నాం. వీటన్నింటికీ ఛార్జింగ్ పెట్టడమే ఒక పెద్ద పని. ఈ నేపథ్యంలో ఇయర్ బడ్స్ ఛార్జింగ్ కూడా చూసుకోవాలంటే అది మరో తలనొప్పి. అందుకే బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు నేరుగా ఫోన్‌కు ప్లగ్ చేసి గంటల కొద్దీ పాటలు వినడానికి వైర్డ్ ఇయర్ ఫోన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయని మళ్లీ దీనినే ఎక్కువగా వాడుతున్నారు.

Also Read: వాట్సప్ అదిరిపోయే అప్డేట్.. ఈ గోల్డెన్ ఛాన్స్ ఐఫోన్ యూజర్లకు మాత్రమే!

అద్భుతమైన సౌండ్ క్వాలిటీ:

బ్లూటూత్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ.. వైర్ ద్వారా వచ్చే సౌండ్ క్వాలిటీని అందుకోలేకపోతోంది. వైర్లెస్ సిగ్నల్స్ ప్రసారమయ్యేటప్పుడు ఆడియో అంత క్లియర్‌గా వినిపించదు. కానీ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌లో సిగ్నల్ నేరుగా అందుతుంది కాబట్టి.. మ్యూజిక్ చాలా స్పష్టంగా, సహజంగా వినిపిస్తుంది. అందుకే మ్యూజిక్ లవర్స్ ఇప్పటికీ వైర్డ్ ఆప్షన్స్‌నే ఎంచుకుంటున్నారు.

పోగొట్టుకునే భయం లేదు:

వైర్లెస్ ఇయర్ బడ్స్‌లో.. ఏదైనా ఒక బడ్ పడిపోయినా సెట్ మొత్తం వృధా అయిపోతుంది. కానీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ రెండు వైర్లతో కలిసి ఉంటాయి కాబట్టి.. వాటిని పోగొట్టుకునే అవకాశం చాలా తక్కువ. అలాగే గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్లకి వైర్డ్ ఇయర్ ఫోన్స్ బెస్ట్ ఆప్షన్. గేమ్ ఆడేటప్పుడు సౌండ్‌కి, యాక్షన్‌కు మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదు. దీంతో రియల్ టైమ్ అనుభూతిని పొందవచ్చు.

యువత మెచ్చిన ట్రెండ్:

కేవలం టెక్నాలజీ కోసమే కాదు.. ప్రస్తుతం వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుయెన్సర్లు మళ్లీ వీటిని వాడటం మొదలుపెట్టారు. పాతకాలపు వస్తువుల మీద మళ్లీ మక్కువ పెరుగుతున్న ఈ రోజుల్లో.. సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ నేటి యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Also Read: బట్టలు కాలిపోకుండా ఉండాలంటే.. ఐరన్ బాక్స్ వాడాలా? లేక స్టీమరా?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×