E-Paper
Advertisement

Fan Cleaning: ఫ్యాన్‌కు బాగా దుమ్ము పట్టిందా? నిచ్చెనతో పనిలేకుండా.. ఇలా ఈజీగా క్లీన్ చేయండి!

Fan Cleaning: ఫ్యాన్‌కు బాగా దుమ్ము పట్టిందా? నిచ్చెనతో పనిలేకుండా.. ఇలా ఈజీగా క్లీన్ చేయండి!
Advertisement

Fan Cleaning: సాధారణంగా సీలింగ్ ఫ్యాన్ ను శుభ్రం చేయడమంటే కాస్త కష్టంతో కూడుకున్న పని. బాగా ఎత్తులో అమర్చబడి ఉండే ఈ ఫ్యాన్లను క్లీన్ చేయాలంటే తప్పనిసరిగా నిచ్చెన (Ladder) అవసరం ఉంటుంది. అయితే చాలా ఇళ్లల్లో ఈ నిచ్చెన అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటించడం ద్వారా నిచ్చెన లేకుండానే సీలింగ్ ఫ్యాన్ ను శుభ్రం చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

పిల్లో కవర్ పద్ధతి

సీలింగ్ ఫ్యాన్ ను శుభ్రం చేయడంలో దీన్ని ఉత్తమమైన మార్గంగా చెప్పవచ్చు. అలాగే ఇది స్మార్ట్ ఐడియాగానూ పనిచేస్తుంది. ముందుగా ఒక పాత దిండు కవర్ ను తీసుకొని దాన్ని ఫ్యాన్ రెక్కకు తొడగండి. అనంతరం కవర్ పై నుంచి రెక్కను రెండు వైపుల నుంచి గట్టిగా పట్టుకొని వెనక్కి లాగండి. అలా చేయడం ద్వారా దుమ్మంతా పిల్లో కవర్ లోపలే ఉండిపోతుంది. గది నేలపై డస్ట్ ఏమాత్రం పడదు.

పొడవైన హ్యాండిల్ డస్టర్

Advertisement

ప్రస్తుతం మార్కెట్ లో పొడవైన డస్టర్స్ (Extendable Microfiber Dusters) అందుబాటులో ఉన్నాయి. వీటి హ్యాండిల్ పొడవును మనకు కావలసినంత వరకూ పెంచుకునే వెసులుబాటు సైతం ఉంటుంది. దానిని ఉపయోగించి.. నిచ్చెనతో పని లేకుండా ఈజీగా ఫ్యాన్ ను క్లీన్ చేయవచ్చు. అయితే దుమ్ము నేలపై పడకుండా ఉండాలంటే.. డస్టర్‌పై కొద్దిగా నీటిని లేదా క్లీనింగ్ లిక్విడ్‌ను స్ప్రే చేయండి. అప్పుడు దుమ్ము తడికి అంటుకుని డస్టర్‌కే ఉండిపోతుంది.

వాక్యూమ్ క్లీనర్

ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉంటే.. దానికి ఉండే పొడవైన పైపునకు.. బ్రష్ అటాచ్‌మెంట్‌ను వాడండి. తద్వారా కింద నిలబడే బ్రష్ సహాయంతో ఫ్యాన్ రెక్కల పైభాగంలో ఉన్న దుమ్మును తొలగించవచ్చు. ఇది ఎలాంటి శ్రమ, నిచ్చెన అవసరం లేకుండా సీలింగ్ ఫ్యాన్ ను తళతళా మెరిసేలా చేస్తుంది.

పెయింట్ రోలర్, క్లీనింగ్ లిక్విడ్

Advertisement

ఇంట్లో నిచ్చెన, వాక్యూమ్ క్లీనర్ లేనప్పుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఒక పొడవైన కర్రకు పెయింట్ రోలర్‌ను అమర్చి.. దానికి పాత మైక్రోఫైబర్ క్లాత్‌ను చుట్టండి. ఆ క్లాత్‌ను కొద్దిగా తడిపి ఫ్యాన్ రెక్కలపై రుద్దడం ద్వారా శుభ్రం చేయవచ్చు. ఈ చిట్కాను ఉపయోగించి మొండిగా పేరుకుపోయిన జిడ్డును సైతం తొలగించవచ్చు.

Also Read: సామాన్యుల బ్రాండ్.. వర్ల్‌పూల్ టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్ భయ్యా!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

అయితే సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్లీనింగ్ మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలి. క్లీనింగ్ సమయంలో కళ్ళలో దుమ్ము పడకుండా ఉండటానికి కళ్ళద్దాలు, మాస్క్ ధరించడం మంచిది. ఫ్యాన్ కింద ఉన్న నేల, మంచంపై దుమ్ము, దూళి పడకుండా ఒక పాత క్లాత్ ను వేయడం ద్వారా ఈజీగా ఆ డస్ట్ ను సైతం తొలగించుకోవచ్చు.

Also Read: సమ్మర్ లో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 7 విషయాలు మర్చిపోకండి!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×