E-Paper
Advertisement

రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!
Advertisement

ECOVACS N30 Robotic Floor Cleaner: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడం చాలా కష్టమైన పనుల్లో ఒకటి. రోజూ ఊడ్వడం, తుడవడం వంటి పనులతో ఇల్లాళ్లకు టైమ్ సరిపోవడం లేదు. ఈ సమస్యకు లేటెస్ట్ టెక్నాలజీ పరిష్కారం చూపుతోంది ప్రముఖ కంపెనీ ఎకోవాక్స్. మార్కెట్లో అందుబాటులో.. ఉన్న బెస్ట్ రోబోటిక్ క్లీనర్లలో ‘ECOVACS N30 Robotic Floor Cleaner’ ఒకటిగా నిలిచింది. ఇది కేవలం ఫ్లోర్ క్లీనింగ్ మాత్రమే కాకుండా.. మీ ఇంటిని నీట్‌గా ఉంచడంలో పర్ఫెక్ట్ అసిస్టెంట్‌లా పని చేస్తుంది. ఎలాంటి హ్యూమన్ ఇంటర్‌వెన్షన్ లేకుండా ఇల్లంతా ఆటోమేటిక్‌గా క్లీన్ చేసేయడం దీని ప్రత్యేకత.

ఫీచర్లు:

సక్షన్ పవర్, పనితీరు:

ఈ రోబోటిక్ క్లీనర్ మెయిన్ హైలైట్ దీని పనితీరు. ఇది అత్యంత పవర్‌ఫుల్ అయిన 10,000 Pa సక్షన్ పవర్ కలిగి ఉంది. హై-స్పీడ్ మోటార్, ప్రత్యేకమైన డక్ట్ డిజైన్ కారణంగా ఇది ఇంట్లోని సూక్ష్మమైన ధూళి కణాలను, చెత్తను, కార్పెట్లపై ఉన్న మురికిని కూడా క్షణాల్లో పీల్చేసుకుంటుంది. అంతేకాకుండా.. ఇందులో 2 ఇన్ 1 వాక్యూమ్ , మోపింగ్ ఫీచర్ ఉంది. అంటే ఒకే సమయంలో.. ఇల్లు ఊడ్వడం, తడి గుడ్డతో తుడవడం రెండు పనులు ఏక కాలంలో జరిగిపోతాయి. దీని వల్ల టైం ఆదా కావడంతో పాటు ఇల్లు అత్యంత శుభ్రంగా మారుతుంది.

లాంగ్ లాస్టింగ్ 5200mAh బ్యాటరీ:

Advertisement

పెద్ద ఇళ్లలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లీనింగ్ చేయడానికి వీలుగా ఈ డివైజ్‌లో 5200mAh బ్యాటరీను అమర్చారు. ఒక సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. ఇది సుమారు 300 నిమిషాల (5 గంటలు) పాటు నిరంతరం పని చేస్తుంది. దీని వల్ల ఒకే ఛార్జ్‌తో పెద్ద ఇళ్లలోని అన్ని రూమ్ లను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్న జీరో ట్యాంగిల్ 2.0 టెక్నాలజీ కారణంగా ఇంట్లో రాలిపడే జుట్టు లేదా పెంపుడు జంతువుల వెంట్రుకలు బ్రష్‌కు చుట్టుకోకుండా చాలా క్లీన్ చేస్తుంది.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా?రూ.7,990లకే 24 ఇంచుల టీవీ

అడ్వాన్స్‌డ్ ట్రూ మ్యాపింగ్,స్మార్ట్ యాప్ కంట్రోల్:

Advertisement

ఈ రోబోటిక్ క్లీనర్‌లో లేటెస్ట్ ట్రూ మ్యాపింగ్ నావిగేషన్ టెక్నాలజీ ఉంది. అందుకే ఇది కేవలం 8 నిమిషాల్లోనే.. సుమారు 1000 చదరపు అడుగుల ఇంటి ప్రాంతాన్ని కచ్చితమైన మ్యాప్‌లా తయారు చేసుకోగలదు. దీని వల్ల ఇళ్లలోని ప్రతి మూలకు రోబో ఈజీగా వెళ్తుంది. దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా సింపుల్. మీ స్మార్ట్‌ ఫోన్లోని ECOVACS HOME App ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. వాటర్ ఫ్లో లెవెల్స్ మార్చడం, సక్షన్ పవర్ అడ్జస్ట్ చేయడం, క్లీనింగ్ షెడ్యూల్స్ సెట్ చేయడం వంటి వన్నీ ఫోన్ ద్వారానే మేనేజ్ చేసుకోవచ్చు. టైల్స్, మార్బుల్స్, చెక్క ఫ్లోరింగ్ , కార్పెట్లు అన్నింటిపై ఇది అద్భుతంగా పని చేస్తుంది.

ధర :

ఫుడ్ అండ్ హోమ్ అప్లయన్సెస్ మార్కెట్లో.. ప్రీమియం ఫీచర్లతో లభించే.. ఈ ఎకోవాక్స్ N30 రోబోటిక్ క్లీనర్ అసలు ధర మార్కెట్లో రూ.59,999గా ఉంది. అయితే.. ప్రస్తుతం కంపెనీ, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో దీనిపై 60% భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా ఈ అడ్వాన్స్‌డ్ రోబోటిక్ క్లీనర్‌ను కేవలం రూ.23,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

Related News

రూ.998లకే పోర్టబుల్ జ్యూసర్..ఆఫీస్‌,జిమ్‌కు పర్ఫెక్ట్

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా?రూ.7,990లకే 24 ఇంచుల టీవీ

ఖరీదైన టీవీ ఇప్పుడు తక్కువ ధరలో..ఈ సూపర్ డీల్ మిస్ కావద్దు!

తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోయే.. టాప్ వాటర్ ప్యూరిఫైయర్లు!

హోటళ్లు,ఫుడ్ బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్లు..ఇప్పుడు డిస్కౌంట్‌లోనే!

ఇంట్లో తేమతో విసిగిపోయారా? ఈ డిహ్యూమిడిఫైయర్లపై ఓ లుక్కేయండి

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×