E-Paper
Advertisement

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?
Advertisement

ఆగస్టు 26.. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలు..అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. భారీ జలప్రళయానికి వేలాది ఇళ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. చైనా-నేపాల్ సరిహద్దుల్లోని గిరాంగ్ పోర్ట్ కాంప్లెక్స్ సైతం పూర్తిగా ధ్వంసమైంది.

ఉవ్వెత్తున దూసుకొచ్చిన బురద నీటి ప్రవాహం..చుట్టుముట్టడంతో అక్కడున్న ఇళ్లన్నీ కూలిపోయాయి. కానీ..గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడింది. చుట్టూ ఉన్న ఇళ్లు కొట్టుకుపోతుండటంతో ఆ ఇంట్లో ఉన్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వరదను చూస్తుండిపోయారు.

Advertisement

అసలు ఆ బిల్డింగ్‌ ఉప్పెనలా దూసుకొచ్చిన వరదను తట్టుకొని నిలబడటానికి రీజనేంటి? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇంటి నిర్మాణం, బలమైన పునాది కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు పక్కనున్న ఇళ్లు, చెట్లు వరద ప్రవాహాన్ని అడ్డుకోవడంతో..నీటి తీవ్రత డైరెక్ట్‌గా ఆ ఇంటిపై నేరుగా పడలేదని చెబుతున్నారు.

ఆ ఇంటిని డిజైన్‌ చేసిన ఇంజనీర్‌ గొప్పతనమన్న టాక్‌ కూడా ఉంది. టెస్లా వాల్వ్ ప్రక్రియ దానికి కారణమని.. దీని వల్ల ప్రవాహం ఒక దగ్గరకు వచ్చే సరికి రెండుగా చీలిపోయి..మధ్యలో ఉన్న ప్రాంతంపై తీవ్రత తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరొకరమో బెర్నౌలీ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు.

Advertisement

ఇంటి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్‌ ఫ్లోర్‌లోని కొన్ని భాగాలు ధ్వంసం కావడంతో..వరద నీటికి అడ్డంకి లేకుండా ప్రవహించిందని ఇంకొందరు చెబుతున్నారు. అంటే.. బలమైన పునాది, నిర్మాణ నాణ్యతతో పాటు.. ఇంటి చుట్టూ ఉన్న నిర్మాణాలు, వరద ప్రవాహం దిశ, శిథిలాల ప్రభావం.. ఇలా అనేక అంశాలు కలిసి ఈ ఇల్లు నిలబడటానికి కారణమై ఉండొచ్చని అంటున్నారు.

Also Read: ఏంటీ.. నేపాల్ వరద ప్రవాహ వేగం గంటకు 200 కిమీలా? 4 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి..

ఏదేమైనా.. చుట్టూ ఉన్న ఇళ్లన్నీ కొట్టుకుపోతుంటే.. ఈ ఒక్క బిల్డింగ్‌ మాత్రం నిలబడటం అందరినీ షాక్‌కు గురిచేసింది. చివరకు ఇంట్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్‌ సేఫ్‌గా బయటకు తీసుకొచ్చాయి. దీంతో నేపాల్ వరదల్లో ఈ ఇల్లు ఇప్పుడు మిరాకిల్ హౌస్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Related News

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

షాపింగ్ మాల్ కోసం.. 200 ఏళ్ల నాటి గురుద్వారా కూల్చివేత.. పాక్‌ను ఏకిపారేస్తున్న సిక్కులు!

యురేనియం డీల్, ఫ్రీ వీసా, పౌర పురస్కారం.. ప్రధాని ఉజ్బెకిస్థాన్ పర్యటన సూపర్‌ హిట్!

నేపాల్‌లో అద్భుతం.. 1,643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్ మాస్టర్.. ఏం జరిగిందంటే?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక నిర్ణయం.. డోక్లాం-గాల్వాన్ ఘర్షణల జనరల్‌పై వేటు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×