E-Paper
Advertisement

Electric Hot Pots: ఎలక్ట్రిక్ హాట్ పాట్ ఉంటే చాలు.. గ్యాస్ లేకుండానే నిమిషాల్లో వంట చేసేయొచ్చు !

Electric Hot Pots: ఎలక్ట్రిక్ హాట్ పాట్ ఉంటే చాలు.. గ్యాస్ లేకుండానే నిమిషాల్లో వంట చేసేయొచ్చు !
Advertisement

Electric Hot Pots: ఈ రోజుల్లో ఇంట్లోనే.. సింపుల్‌గా వంట చేసుకోవడానికి చాలా మంది ఎలక్ట్రిక్ హాట్ పాట్‌లను ఉపయోగిస్తున్నారు. చిన్న సైజ్, తక్కువ కరెంట్ వినియోగంతో పాటు సింపుల్‌గా వంట చేసుకోవచ్చు. స్టూడెంట్స్, బ్యాచిలర్స్, హాస్టల్‌లో ఉండే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ద్వారా సూప్, నూడుల్స్, రైస్, కర్రీస్ చిన్న చిన్న వంటకాలు తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. గ్యాస్ అవసరం లేకుండా కేవలం ప్లగ్ పెట్టి వంట చేసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం ఎలక్ట్రిక్ హాట్ పాట్‌కి మార్కెట్‌లో  డిమాండ్ పెరుగుతోంది.

ఎలక్ట్రిక్ హాట్ పాట్ అంటే ఏంటి?

Advertisement

ఎలక్ట్రిక్ హాట్ పాట్ అనేది కరెంట్‌తో పని చేసే చిన్న వంట పాత్ర. దీనిలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ప్లగ్ పెట్టగానే.. పాత్ర వేడెక్కి వంట చేయడానికి ఉపయోగ పడుతుంది. సాధారణంగా 1 నుంచి 2 లీటర్ల కెపాసిటీతో వస్తాయి. హాస్టల్, రూమ్, ఆఫీస్ వంటి చిన్న ప్రదేశాల్లో వంట చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

వాడటం చాలా సులభం: 
ఎలక్రిక్ హాట్ పాట్ వాడటం చాలా ఈజీ. ఇందుకోసం ముందుగా పాత్రలో కావలసిన పదార్థాలు వేసి నీళ్లు లేదా నూనె పోయాలి. తర్వాత ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే వంట మొదలవుతుంది. కొంత మంది మోడల్స్‌లో టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉంటుంది. అందువల్ల మనకు అవసరమైన వేడి స్థాయిని సెట్ చేసుకోవచ్చు.

Advertisement

ఏ వంటలు చేయవచ్చు?

ఎలక్ట్రిక్ హాట్ పాట్‌లతో చాలా రకాల వంటలు చేయొచ్చు. ఉదాహరణకు..

నూడుల్స్

సూప్స్

ఎగ్స్

రైస్

మ్యాగ్గీ

కూరగాయలు

ఓట్స్

ఇవి మాత్రమే కాదు.. కొంత మంది చిన్న ఫ్రై ఐటమ్స్ కూడా చేస్తారు. అందుకే ఇది మినీ కిచెన్‌లా ఉపయోగపడుతుంది.

స్టూడెంట్స్, బ్యాచిలర్స్‌కు ఉపయోగం:
హాస్టల్ లేదా రూమ్‌లో ఉండే విద్యార్థులు ఎక్కువగా బయట తినాల్సి వస్తుంది. కానీ హాట్ పాట్ ఉంటే సులభంగా ఉన్నచోటే వంట చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ఇది మంచి మార్గం. పైగా బయట ఫుడ్ ఖర్చు కూడా తగ్గుతుంది.

సేఫ్టీ ఫీచర్స్:

ఇప్పుడు వచ్చే చాలా ఎలక్ట్రిక్ హాట్ పాట్‌లలో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఫీచర్స్ వల్ల వాడేటప్పుడు ప్రమాదాలు తగ్గుతాయి. ఉదాహరణకు..

1.ఓవర్ హీట్ పొటెక్షన్

2. అటోమెటిక్‌గా ఆఫ్ అవ్వడం

3. హీట్ రెసిస్టెంట్

Also Read: ఇండక్షన్ స్టౌవ్‌ స్టాక్ అవుటా? అయితే ఈ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ పై ఓ లుక్కేయండి

కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

మంచి బ్రాండ్ తీసుకోవాలి.

స్టెయిన్లెస్ స్టీల్ లేదా నాన్ స్టిక్ కోటింగ్ ఉండాలి.

సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి.

వారంటీ ఉండటం మంచిది.

ఇలా చూసుకుంటే.. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ హాట్ పాట్‌లు చిన్న దైనా చాలా ఉపయోగకరమైన కిచెన్ పరికరం. తక్కువ సమయంలో.. నూడుల్స్, సూప్, రైస్ వంటి వంటలు సులభంగా చేసుకోవచ్చు. గ్యాస్ అవసరం లేకుండా కేవలం ప్లగ్ పెట్టి వంట చేసుకోవడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా స్టూడెంట్స్, బ్యాచిలర్స్ , చిన్న రూమ్‌లో ఉండే వారికి ఇది మంచి కుకింగ్ సొల్యూషన్.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×