E-Paper
Advertisement

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్వాగ్‌పై రామ్ చరణ్ ప్రశంసలు.. హరీష్ ఏమన్నారంటే?

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్వాగ్‌పై రామ్ చరణ్ ప్రశంసలు.. హరీష్ ఏమన్నారంటే?
Advertisement

Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ వీడియోపై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ స్వాగ్ చూస్తుంటే అభిమానులకు పండగే అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని, పవన్‌ను తెరపై ఎలా చూపించాలో హరీష్‌కు బాగా తెలుసని చరణ్ కొనియాడారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ అదే కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచ నాలు పెట్టుకున్నారు. అభిమానులు.

Read also-CSK ROAR26: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చెన్నై సూపర్ కింగ్స్ వేడుకలో ‘పెద్ది’ సందడి

Advertisement

ఈ ఉగాది పండుగను ‘ఉస్తాద్’ టీమ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రామ్ చరణ్ తన సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు చిత్ర యూనిట్ మొత్తానికి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ఇంపాక్ట్‌ను మళ్ళీ ఈ సినిమా గుర్తుచేస్తుందని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read also-Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. అన్నీ శుభాలే..చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Advertisement

రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ డైలాగులు ఈ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మెగా వారసుడి మద్దతుతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా కోసం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ కు మూవీ ట్రైలర్ నచ్చడం చాలా సంతోషంగా ఉంది.. సినిమా కూడా మీరు అనుకున్నట్లు గానే ఉంటుంది అని చెప్పుకొచ్చారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×