E-Paper
Advertisement

Induction Stove Tips: ఇండక్షన్ స్టవ్ వాడుతూ కరెంటు బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు.. అదెలాగో తెలుసా?

Induction Stove Tips: ఇండక్షన్ స్టవ్ వాడుతూ కరెంటు బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు.. అదెలాగో తెలుసా?
Advertisement

Induction Stove Tips: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మన దేశవ్యాప్తంగా కూడా వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి ద్వారా సులభంగా, వేగంగా వంట చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కరెంటు బిల్లు పెరుగుతుందేమోననే భయం కొంతమందిని వెంటాడుతోంది. అయితే, ఇండక్షన్ స్టవ్ వాడేటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే విద్యుత్ ఆదా చేయొచ్చు. అదెగాలో ఇప్పుడు చూసేద్దాం రండి..

ఇండక్షన్ ఎలా పనిచేస్తుంది?

ఇండక్షన్ స్టవ్ లోపల ఉండే రాగి కాయిల్ విద్యుత్ అయస్కాంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మనం స్టవ్ మీద పెట్టిన పాత్ర ఇనుము లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారై ఉంటేనే ఆ అయస్కాంత క్షేత్రం నేరుగా పాత్రను వేడి చేస్తుంది. దీనివల్ల వేడి వృధా కాకుండా నేరుగా గిన్నెకు మాత్రమే అందుతుంది.

Advertisement

Also Read: వావ్, గ్యాస్ స్టవ్‌లా పనిచేసే ఎలక్ట్రిక్ స్టవ్.. ధర కూడా చాలా తక్కువ!

విద్యుత్ ఆదా చేసే మార్గాలు:

⇒ కరెంటు బిల్లు తగ్గాలంటే ముందుగా సరైన పాత్రలను ఎంచుకోవాలి. అడుగు భాగం సమానంగా ఉండి, ఇండక్షన్‌కు సపోర్ట్ చేసే పాత్రలనే వాడాలి. పాత్ర పరిమాణం స్టవ్ మీద ఉన్న సర్కిల్ కు తగ్గట్టుగా ఉంటే వేడి బయటకు పోదు. వంట చేసేటప్పుడు పాత్రపై మూత పెట్టడం వల్ల లోపల వేడి త్వరగా పెరిగి వంట త్వరగా పూర్తవుతుంది.

Advertisement

⇒ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇండక్షన్ స్టవ్ పెనం మీద పెట్టగానే వేడెక్కుతుంది. కాబట్టి అనవసరంగా ముందే ఆన్ చేసి ఉంచకూడదు. విప్రో ఇండక్షన్ వంటి ఆధునిక స్టవ్‌లలో ఉండే ప్రీ-సెట్ మెనూ ఆప్షన్లను వాడటం వల్ల ఏ వంటకు ఎంత వేడి కావాలో అంత మాత్రమే వినియోగించుకుంటుంది. వంట పూర్తయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం, గ్లాస్ ప్లేట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల స్టవ్ సామర్థ్యం పెరుగుతుంది.

⇒ ఇండక్షన్ స్టవ్ వాడటం వల్ల సమయం ఆదాతో పాటు వంటగదిలో వేడి కూడా తక్కువగా ఉంటుంది. పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, వంట చేయడాన్ని ఎంజాయ్ చేయడమే కాకుండా నెలాఖరులో వచ్చే కరెంటు బిల్లును కూడా సగానికి తగ్గించుకోవచ్చు.

Also Read: ఫ్రిడ్జ్ డోర్ తీయకుండానే కూల్ వాటర్ తాగొచ్చు.. AI టెక్నాలజీతో సరికొత్త రిఫ్రిజిరేటర్ లాంచ్!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×