E-Paper
Advertisement

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్
Advertisement

Best home gym equipments: ఈ రోజుల్లో ఫిట్‌గా ఉండటం అందరికీ అవసరంగా మారింది. కానీ ఆఫీస్ వర్క్, బిజీ లైఫ్, ట్రాఫిక్ వల్ల చాలా మంది రోజూ జిమ్‌కు వెళ్లలేకపోతున్నారు. మరి కొందరు జిమ్ ఫీజులు భారీగా ఉండటంతో వెనకడుగు వేస్తున్నారు. అందుకే.. ప్రస్తుతం హోమ్ జిమ్ సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది. ఇంట్లోనే ఒక చిన్న స్థలంలో బేసిక్ వస్తువులతో జిమ్ సెటప్ చేసుకుంటే.. సమయం కలసిరావడమే కాదు, ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. లేటెస్ట్ ఫిట్‌నెస్ ట్రెండ్స్ ప్రకారం.. మీ బడ్జెట్‌లో ఒక పర్ఫెక్ట్ హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ కావాలో, వాటి లేటెస్ట్ ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. యోగా మ్యాట్, ఫ్లోరింగ్ :
హోమ్ జిమ్‌కు పునాది లాంటిది మంచి ఫ్లోరింగ్. ఇంట్లో బరువులు ఎత్తేటప్పుడు కింద టైల్స్ పగిలిపోకుండా ఉండాలన్నా.. మీరు పుష్-అప్స్, అబ్స్ వర్కవుట్స్ ఫ్రీగా చేసుకోవాలన్నా ఇది చాలా ముఖ్యం.

Advertisement

ధరల వివరాలు: ఒక మంచి క్వాలిటీ 6mm లేదా 8mm యోగా మ్యాట్ ధర సుమారుగా రూ.350 నుంచి రూ. 800 లోపు లభిస్తుంది. ఒకవేళ బరువులు పెట్టడానికి ఇంటర్‌లాకింగ్ రబ్బర్ మ్యాట్స్ (4 ముక్కల సెట్) కావాలంటే.. వాటి ధర రూ.1,200 నుంచి రూ. 2,000 వరకు ఉంటుంది.

2. అడ్జస్టబుల్ డంబెల్స్, బార్‌బెల్ సెట్:
ఇంట్లో వేర్వేరు బరువులు ఉండే డంబెల్స్ చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అందుకే ప్లేట్లు మార్చుకునే వీలుండే ‘అడ్జస్టబుల్ డంబెల్స్’ హోమ్ జిమ్‌కు బెస్ట్ ఆప్షన్. దీని వల్ల బైసెప్స్, షోల్డర్, చెస్ట్ వర్కవుట్స్ అన్నీ చేసుకోవచ్చు.

Advertisement

ధరల వివరాలు:  రాడ్స్, లాక్స్, 20 కేజీల వెయిట్ ప్లేట్లతో వచ్చే పీవీసీ/రబ్బర్ డంబెల్ సెట్ ధర రూ. 1,800 లోపే లభిస్తుంది. ఒకవేళ లైఫ్ లాంగ్ మన్నే ఐరన్ లేదా క్రోమ్ వెయిట్ సెట్ కావాలనుకుంటే దాని ధర రూ. 2,500 నుంచి రూ. 4,500 వరకు ఉంటుంది.

3. అడ్జస్టబుల్ వర్కవుట్ బెంచ్:
డంబెల్స్ ఉన్నప్పుడు వాటిని ఉపయోగించి చెస్ట్ ప్రెస్, ఇంక్లైన్ ప్రెస్ లేదా కూర్చుని చేసే వ్యాయామాల కోసం ఒక బెంచ్ ఖచ్చితంగా అవసరం. ఫ్లాట్ బెంచ్ కంటే అడ్జస్ట్ చేసుకునే బెంచ్ అయితే అన్ని రకాల వర్కవుట్స్‌కు పని కొస్తుంది.

ధర: హోమ్ యూజ్ కోసం ఫోల్డబుల్ (మడతబెట్టుకునే) అడ్జస్టబుల్ బెంచ్ ధర సుమారుగా రూ. 5,500 వరకు లభిస్తుంది.

4. రెసిస్టెన్స్ బ్యాండ్స్, స్కిప్పింగ్ రోప్:
కార్డియో (ఫ్యాట్ బర్నింగ్) చేయడానికి, బాడీ స్ట్రెచింగ్ ,మజిల్ బిల్డింగ్‌కు ఇవి చాలా తక్కువ ఖర్చుతో కూడిన సూపర్ ఎక్విప్‌మెంట్స్. ఇవి అసలు స్థలాన్ని ఆక్రమించవు. ఊరు వెళ్లినా బ్యాగులో వేసుకుని తీసుకెళ్లొచ్చు.

ధర: వేర్వేరు రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండే 5 బ్యాండ్ల కంప్లీట్ సెట్ ధర రూ.400 నుంచి రూ. 900 వరకు ఉంటుంది. ఒక బేసిక్ స్కిప్పింగ్ రోప్ ధర కేవలంరూ. 300 లోపే ఉంటుంది.

5. పుల్-అప్ బార్:
వీపు, చేతుల కండరాలను బలంగా మార్చడానికి పుల్-అప్స్ కి మించిన వ్యాయామం లేదు. ఇంటి తలుపుల ఫ్రేమ్‌కు లేదా గోడకు బిగించుకునే పుల్-అప్ బార్స్ ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతున్నాయి.

ధర: డోర్ ఫ్రేమ్‌కు ఫిక్స్ చేసుకునే అడ్జస్టబుల్ పుల్-అప్ బార్ ధర రూ. 600 వరకు ఉంటుంది.

మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది?
మీరు గమనిస్తే.. పైన చెప్పిన అన్ని బేసిక్ వస్తువులను (మ్యాట్, డంబెల్స్, బెంచ్, బ్యాండ్స్, పుల్-అప్ బార్) కలిపి కొన్నా, మీ మొత్తం హోమ్ జిమ్ సెటప్ ఖర్చు కేవలంరూ. 12,000 లోపే అయిపోతుంది. మీరు ప్రతి నెలా జిమ్‌కు కట్టే ఫీజుతో పోలిస్తే ఇది వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే. కాబట్టి.. ఆలస్యం చేయకుండా మీ బడ్జెట్‌ను బట్టి ఈ వస్తువులను తెచ్చుకుని, మీ ఇంట్లోనే హ్యాపీగా ఫిట్‌నెస్ జర్నీని స్టార్ట్ చేసేయండి.

 

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×