Water Expiry Date: మన డైలీ లైఫ్ లో నీరు చాలా ముఖ్యం. అయితే నీటికి ఎక్స్ పైర్ ఉంటుందా? ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పాడైపోతుందా? అని డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. సాధారణంగా నీరు దానంతట అదే పాడవ్వదు. వాస్తవంగా నీటికి ఎక్స్ పైరీ డేట్ ఉండదు. కానీ నీటిని నిల్వ చేసే బాటిల్స్, నిల్వ చేసే విధానం బట్టి నీరు పాడవుతుంది. ఎక్కువగా నీటిని వాటర్ బాటిల్స్ లో నిల్వ చేస్తారు. ఈ బాటిల్ కు ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. వాటర్ బాటిల్స్ పై తరచుగా గడువు తేదీని ప్రింట్ చేస్తారు. ఇది సాధారణంగా బాటిల్ లో నీటిని నింపిన తేదీ నుంచి సుమారు రెండు సంవత్సరాలు ఉంటుంది.
ఈ విధానం 1980లో అమెరికాలో ప్రారంభమైంది. ప్రస్తుతం బాటిల్స్ లో ప్యాక్ చేసిన నీటిపై గడువు తేదీలను తప్పనిసరి అనేంలేదు. కానీ ఈ డేట్ ప్రధానంగా నీరు పాడైపోవడాన్ని కాకుండా, ప్లాస్టిక్ బాటిల్ కెమికల్స్ నీటిలో కరికే ప్రమాదాన్ని సూచిస్తాయి. యాంటిమోనీ, బిస్ఫెనాల్ ఎ వంటి పదార్థాలు, ముఖ్యంగా వేడికి గురైనప్పుడు, ప్లాస్టిక్ కంటైనర్ల నుంచి నీటిలో నెమ్మదిగా కరుగుతాయి. ఈ నీటిని తాగితే ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, హార్మోన్లపై ప్రభావితం చూపుతుంది.
అందుకే ప్లాస్టిక్ బాటిల్స్ ను తిరిగి ఉపయోగించవద్దని నిపుణులు సూచిస్తారు. నీటికి ఎక్స్ పైరీ డేట్ లేకపోయినా, బాటల్ మూత ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్టీరియా, ఫంగస్ నీటిలో చేరుతుంది. ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్ అధ్యయనం ప్రకారం.. వాటర్ బాటిల్స్ లో బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. వాటర్ బాటిల్ మూత తీసినప్పుడల్లా సూక్ష్మజీవులు బాటిల్ లోకి ప్రవేశిస్తాయి. బాటిల్ వాల్స్ అంటుకుని వృద్ధి చెందుతాయి. ప్లాస్టిక్ బాటిల్స్ తిరిగి ఉపయోగించగల బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల కడుపు నొప్పి, విరేచనాలు, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సూక్ష్మజీవుల వల్ల చెడు వాసన, అలెర్జీ కలిగించవచ్చు. అందుకే తాగునీటి కోసం బెస్ట్ ప్రాక్టిసెస్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువగా ఉపయోగించే సీసాలను ప్రతిరోజూ వేడి నీటితో లేదా సబ్బు నీటితో కడగాలి. వారానికి ఒకసారి వెనిగర్ లేదా బేకింగ్ సోడాతో కడగడం వల్ల బ్యాక్టీరియాను కంట్రోల్ చేయవచ్చు. సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించే, రసాయనాలు విడుదల చేయని స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గాజు సీసాల్లో నీటిని నిల్వ చేయడం బెటర్. నిల్వ చేసే నీటిని వేడి, సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. అలాగే కార్లలో వాటర్ బాటిల్స్ ను వదిలేయకూడదు. పాట బాటిల్స్ ను ఎక్కువ కాలం వాడకూదదు. ఎందుకంటే వాటిలో ఎక్కువ బ్యాక్టీరియా చేరవచ్చు.
Also Read: పెట్రోల్ కోసం ఏకంగా బైకు ట్యాంకే పీక్కొని వచ్చేశాడు.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు!
నీరు స్మెస్ వచ్చినా, జిగటగా ఉన్నా, బూజు కనిపిస్తే, లేదా ఓపెన్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు కంటే ఎక్కువ నిల్వ ఉంచినట్లయితే, ఆ నీటిని వెంటనే పారవేయండి. నీటికి గడువు తేదీ ఉండదు, కానీ నిల్వ చేసే బాటిల్స్ కు ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.