Sravanthi chokarapu (Image credit: Instagram)
రాయలసీమ అమ్మాయిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సొంతం చేసుకుంది స్రవంతి చొక్కారపు.

Sravanthi chokarapu (Image credit: Instagram)
రాయలసీమ అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం నుండి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె టీవీ షోలలో యాంకర్ గా పనిచేస్తూ తన ఉనికిని చాటుకుంది.

Sravanthi chokarapu (Image credit: Instagram)
ఎక్కువగా సినిమా ఈవెంట్లకు హోస్టుగా వ్యవహరిస్తూ.. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. ఇటీవల హే బలవంత్ సినిమాలో నటిగా నటించి తన కలను నెరవేర్చుకుంది.

Sravanthi chokarapu (Image credit: Instagram)
ఇక ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది.

Sravanthi chokarapu (Image credit: Instagram)
సమ్మర్ వేళ స్కై బ్లూ కలర్ కాటన్ చీర ధరించి.. దీనికి కాంబినేషన్లో పింక్ కలర్ బ్లౌజ్ ధరించి , తన అవుట్ ఫిట్ ని ఫుల్ ఫిల్ చేసింది. చీరకు తగ్గట్టుగా కలర్ఫుల్ బ్యాంగిల్స్ ధరించిన ఈమె.. అంతే కలర్ ఫుల్ గా నెక్ పీస్ ధరించి మరింత అందంగా కనిపించింది.

Sravanthi chokarapu (Image credit: Instagram)
ఈ చీర కట్టులో భిన్నభిన్నమైన ఫోజులిచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది స్రవంతి. మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫుడ్ వ్లాగ్స్ అంటూ వంటకాలు కూడా షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.