E-Paper
Advertisement

Lava Agni 4 Mobile: అగ్ని 4 లాంచ్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. డెమో@హోమ్‌తో లావా కొత్త ట్రెండ్

Lava Agni 4 Mobile: అగ్ని 4 లాంచ్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. డెమో@హోమ్‌తో లావా కొత్త ట్రెండ్
Advertisement

Lava Agni 4 Mobile: భారతీయ మొబైల్ మార్కెట్లో స్వదేశీ శక్తిని చూపిస్తున్న లావా, తన కొత్త ఫ్లాగ్‌షిప్ అగ్ని 4 కోసం వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ఫోన్ విడుదలకు ముందే వినియోగదారుల ఇళ్లకే వెళ్లి ప్రత్యక్షంగా డెమో ఇవ్వడం ఈ బ్రాండ్ మొదటిసారి చేపడుతున్న ప్రత్యేక ప్రయోగం. నవంబర్ 20 నుంచి 24 వరకు బెంగళూరు, దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ డెమో@హోమ్ కార్యక్రమం జరుగుతోంది. పాల్గొనాలనుకునే వారు ఆన్‌లైన్ ఫారమ్ ద్వారా నమోదు చేసుకుంటే, అందులోంచి ఎంపికైన కొద్దిమందిని లావా ప్రత్యేకంగా సంప్రదిస్తుంది.

మీ ఇంటికే ఫోన్

Advertisement

అలా సంప్రదించిన వారి ఇంటికి ఇంజనీర్ (టెక్నికల్ నిపుణుడు) నేరుగా వారి వెళ్లి అగ్ని 4 ని చేతిలో పెట్టి ప్రత్యక్ష అనుభవం కల్పించనున్నాడు. ఎలాంటి కొనుగోలు ఒత్తిడి లేకుండా, ఫోన్ విడుదలకు ముందే దానిని దగ్గరగా చూడగలిగే ఇది అరుదైన అవకాశం. ఈ ప్రచారం కొనసాగుతుండగా, లావా మొబైల్స్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో చేసిన తాజా ప్రకటనతో ఆసక్తి మరింత పెరిగింది. సమయం వచ్చేసింది… అగ్ని 4 రేపు ఆవిష్కరణ. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ ప్రారంభం. అంటూ స్పష్టం చేయడంతో ఇప్పుడు అగ్ని 4 విడుదలకు కొన్ని గంటల మాత్రమే సమయం ఉంది. ఈసారి అగ్ని 4 పట్ల లావా పెట్టుకున్న అంచనాలు ఎంత ఉన్నాయో, మొత్తం ప్రమోషన్‌ను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

అగ్ని 4 అదిరిపోయే ఫీచర్లు ఇవే

Advertisement

అగ్ని 4 లో ఉంటాయనుకుంటున్న ఫీచర్లు కూడా ఇప్పటి వరకూ వచ్చిన సమాచారంతో పెద్ద అంచనాలు సృష్టించాయి. 6.67 అంగుళాల 1.5K అమోలేడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో విజువల్ అనుభవం స్పష్టంగా మెరుగవుతుందని భావిస్తున్నారు. మిడియా టెక్ డిమెంసిటీ 8350 చిప్ వాడటం వలన పనితీరు మరింత వేగంగా, స్మూత్‌గా ఉండనుంది. ఎల్‌పిడిడిఆర్5ఎక్స్ ర్యామ్, యుఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ను తీసుకురాబోతున్నట్టుగా లీకులు సూచిస్తున్నాయి.

Also Read: Moto G100 6G 2026: చైనా బ్రాండ్స్‌కు టఫ్ ఫైట్.. 2026లో హాట్ టాపిక్ కానున్న మోటో జి100 6జి

కెమెరా నుంచి బ్యాటరీ వరకు

ఫోన్ కెమెరా సెటప్ విషయంలో 50ఎంపి ప్రధాన సెన్సార్‌తో పాటు 8ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్ ఉండనుంది. ముందు భాగంలో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఇవ్వడం వలన ఫొటోలు, వీడియో కాల్స్ రెండూ నాణ్యంగా ఉంటాయి. 5000mAh బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్‌కు పెద్ద బలం అవుతుందని భావిస్తున్నారు. యుఎస్‌బి 3.2, వైఫై 6ఈ వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లతో ఈ ఫోన్ మధ్యస్థాయి, ప్రీమియం సెగ్మెంట్ మధ్యలో ప్రత్యేక స్థానాన్ని పొందే అవకాశం ఉంది.

డెమో@హోమ్ .. ఎప్పిటి వరకు?

అధికారిక ధర ఇంకా బయటకు రాలేదు కానీ రూ.30,000 లోపు ఉండే అవకాశం ఎక్కువగా వినిపిస్తోంది. లావా ఈసారి స్పెసిఫికేషన్ల కంటే ఎక్కువగా వినియోగదారుడి అనుభవంపై దృష్టి పెట్టినట్టు డెమో@హోమ్ ప్రచారం స్పష్టంగా చెప్పేస్తోంది. షోరూమ్‌కి వెళ్లకుండా, కంపెనీ స్వయంగా ఇంటికి వచ్చి ఫోన్‌ను చూపించడం భారతీయ బ్రాండ్‌లలో ఇప్పటివరకు ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేక అనుభవం నవంబర్ 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత డెమోలు ముగుస్తాయి, ఫోన్ సాధారణ మార్కెట్ విడుదల దశకి చేరుతుంది.

లాంచ్ ఎప్పుడంటే?

లావా అగ్ని 4 ఇప్పుడు కేవలం మరో ఫోన్ కాదు, భారతీయ మొబైల్ రంగంలో వినియోగదారుడిని కేంద్రంగా ఉంచిన కొత్త ఆలోచన, కొత్త ధైర్యం, కొత్త దిశ. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ అవుతున్న ఈ ఫోన్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న ఆసక్తి చూస్తుంటే, అగ్ని 4 విడుదల టెక్ వర్గాల్లో ఎంత పెద్ద తరంగం సృష్టించబోతోందో ఇప్పటికే అర్థమవుతోంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×