E-Paper
Advertisement

Fact Check: అలాంటి వీడియోలు చూస్తే.. CBI నోటీసులు? మీకూ ఇలాంటి మెయిల్స్ వచ్చాయా?

Fact Check: అలాంటి వీడియోలు చూస్తే.. CBI నోటీసులు? మీకూ ఇలాంటి మెయిల్స్ వచ్చాయా?
Advertisement

Fact Check: గత కొంతకాలంగా చాలామందికి CBI లేదా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఈ-మెయిల్స్ వస్తున్నాయి. అవి చూసినప్పుడు నిజంగా ప్రభుత్వ శాఖల నుంచి పంపినట్లే అనిపిస్తాయి. భాష, లోగో, అధికారిక పదాలు అన్నీ నమ్మకం కలిగించేలా ఉంటాయి. కానీ నిజానికి అవి పూర్తిగా మోసపూరిత ఈ-మెయిల్స్ మాత్రమే.

ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?

ఈ నకిలీ ఈమెయిల్స్‌లో ప్రధానంగా భయాన్ని సృష్టించే పదాలను ఎక్కువగా వాడతారు. ఎలాగంటే.. కోర్టు ఆర్డర్ జారీ అయింది, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, తక్షణ అరెస్ట్, భారీ జరిమానా.. ఇలా చదివిన వెంటనే ఎక్కడలేని భయంపుట్టేలా, వారి మెయిల్స్‌కు వెంటనే స్పందించాల్సిందే అన్న ఒత్తిడిని సృష్టిస్తారు.

Advertisement

మరికొన్ని మెయిల్స్‌ ద్వారా.. మీరు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూశారని ఆరోపిస్తూ బెదిరిస్తారు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే. CBI గానీ, సైబర్ క్రైమ్ విభాగం గానీ ఎప్పుడూ వ్యక్తిగత ఈ-మెయిల్స్ ద్వారా ఇలాంటి నోటీసులు పంపవు. కాబట్టి అలాంటి మెయిల్స్ వస్తే అది నకిలీదేనని గుర్తించాలి.

సైబర్ కేటుగాళ్ల ఉద్దేశం ఇదే:

ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టడం. అలాగే అలాంటి మెయిల్స్ చూసిన వెంటనే భయపడిన వ్యక్తి వాళ్లు పంపిన లింక్‌పై క్లిక్ చేయడం లేదా అటాచ్ చేసిన ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం జరుగుతుంది. అలా చేసిన వెంటనే మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. దాని ద్వారా బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారం అన్నీ దొంగిలించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి.. అలాంటి మెయిల్స్ రాగానే స్పందించకపోవడమే ఉత్తమం.

మీరేం చేయాలి?

Advertisement

ఇలాంటి బెదిరింపు  మెయిల్స్ మీకు ఎదురైతే స్పందించాల్సిన అవసరం లేదు. వారు పంపే లింక్‌లను క్లిక్ చేయడం, అటాచ్ చేసిన ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం వంటివి అస్సలు చేయకూడదు. వాటిని డిలీట్ చేయడమో లేదా స్పామ్‌గా గుర్తించడమో చేయాలి. ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే, భద్రత కోసం 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.  భయాన్ని సృష్టించి మోసం చేయడమే ఈ స్కామ్‌ల ప్రధాన వ్యూహం. సరైన సమాచారం తెలుసుకుని జాగ్రత్తగా ఉంటేనే మీరు కూడా సేఫ్‌గా ఉండగలరని గుర్తుంచుకోండి.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×