E-Paper
Advertisement

Balakrishna: సినిమా హిట్టు.. ఫ్లాప్ తో సంబంధం లేదు.. విశ్వనాథుడి సన్నిధిలో బాలయ్య!

Balakrishna: సినిమా హిట్టు.. ఫ్లాప్ తో సంబంధం లేదు.. విశ్వనాథుడి సన్నిధిలో బాలయ్య!
Advertisement

Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna)తాజాగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu)దర్శకత్వంలో నటించిన అఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ, ఎన్నో అవంతరాలను దాటుకొని ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న విధంగా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టని నేపథ్యంలో బాలయ్య అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన అనంతరం దర్శకుడు బోయపాటి శ్రీను నటుడు బాలకృష్ణ పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.

మొక్కు చెల్లించుకున్న బాలయ్య..

ఈ క్రమంలోనే నేడు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కొలువైన విశ్వనాథుడి ఆలయంలో బాలకృష్ణ ,బోయపాటి శ్రీను సందడి చేశారు. బాలయ్య సాంప్రదాయ దుస్తులలో విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం ఈయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆఖండ 2 సినిమా మంచి విజయం అందుకున్న నేపథ్యంలోనే స్వామివారి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చామని బాలకృష్ణ తెలియజేశారు. దేవుడి ఆశీస్సులతో ఆఖండ 2 సినిమా మంచి విజయాన్ని అందుకుందని బాలకృష్ణ తెలిపారు. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అయిందా అనే విషయాలను పక్కనపెట్టి కేవలం స్వామివారిని దర్శించుకోవడం కోసమే వారణాసి వచ్చాము అంటూ బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.

జై అఖండ..

Advertisement

ఇక ఆఖండ సినిమా విడుదలకు ముందు కూడా బాలకృష్ణ, చిత్ర బృందం పలు క్షేత్రాలను దర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక సినిమా విడుదలైన అనంతరం వారణాసిలోని విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు రాగా అఖండ 2నాలుగవ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఇదివరకు సినిమాల మాదిరిగా ఈ సినిమా ప్రేక్షకాదారణ సొంతం చేసుకోలేకపోయింది.

మహారాజుగా బాలకృష్ణ..

Advertisement

ఇకపోతే ఆఖండ 3 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అఖండ 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 కి సంబంధించి జై అఖండ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమా కాకుండా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో మరో సినిమా కూడా రాబోతుందని, ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్  తెరకెక్కబోతోంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోనుంది. ఈ సినిమాకు మహారాజు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇందులో బాలకృష్ణ మహారాజు పాత్రలో ద్విపాత్రాభినయంలో నటించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Jani Master: జానీ మాస్టర్ జోలికి వస్తే తాట తీస్తా.. వారికి శ్రీశైలం యాదవ్ మాస్ వార్నింగ్ !

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×