E-Paper
Advertisement

Skull Scare: హైదరాబాద్‌లో మహిళ పుర్రె కలకలం.. ఇంతకీ ఎవరామె?

Skull Scare: హైదరాబాద్‌లో మహిళ పుర్రె కలకలం.. ఇంతకీ ఎవరామె?
Advertisement

Skull Scare: హైదరాబాద్‌ కీసర అటవీ ప్రాంతంలో పుర్రె కలకలం రేపింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మయిపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన పుర్రెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి అది ఒక మహిళ పుర్రె అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటన జరిగి సుమారు రెండు నుండి మూడు నెలలు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా అటవీ ప్రాంతంలో పడేసి ఉంటారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పుర్రె లభ్యమైన ప్రాంతంలో మరిన్ని ఆధారాల కోసం క్లూస్ టీం సహాయంతో గాలింపు చేపట్టారు.

Advertisement

మృతురాలిని గుర్తించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ఎక్కడైనా మహిళలు కనిపించకుండా పోయినట్లు  కేసులు నమోదై ఉంటే  వెంటనే తమను సంప్రదించాలని కీసర పోలీసులు ఇతర పోలీస్ స్టేషన్లకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని, పుర్రెను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎన్ఏ (DNA) పరీక్షల ద్వారా మృతురాలి ఆచూకీ కనుగొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×