E-Paper
Advertisement

రూ.1,299ధరలో బెస్ట్ ఫీచర్స్..తక్కువ ధరలో ప్రీమియం లుక్

రూ.1,299ధరలో బెస్ట్ ఫీచర్స్..తక్కువ ధరలో ప్రీమియం లుక్
Advertisement

Fire-Boltt Hurricane smartwatch: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ వాచ్‌లు కేవలం సమయం చూసే.. సాధనాలుగా మాత్రమే కాకుండా.. పర్సనల్ ఫిట్‌నెస్ కోచ్‌లుగా మారాయి. చేతికి అందమైన లుక్‌ని ఇస్తూనే.. ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ట్‌ వాచ్‌లకు యూత్ నుంచి విపరీత మైన డిమాండ్ ఉంది. ఈ కోవకే.. చెందిన ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ నుంచి వచ్చిన ఈ మోడల్. గాడ్జెట్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

పూర్తి ఫీచర్లు:

డిస్‌ప్లే,డిజైన్:

ఈ స్మార్ట్‌వాచ్ దీని డిజైన్, స్క్రీన్ క్వాలిటీ. ఇందులో 1.3 అంగుళాల (33 మిమీ) హెచ్‌డీ కర్వ్డ్ గ్లాస్ రౌండ్ డిస్‌ప్లేను అందించారు. దీనికి ఇచ్చిన 2.5D కర్వ్డ్ గ్లాస్ ఫినిషింగ్ వాచ్‌కు మరింత రిచ్ లుక్‌ను ఇస్తుంది. 240 x 240 పిక్సెల్స్ రెసల్యూషన్‌తో స్క్రీన్ చాలా షార్ప్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల రోజు మొత్తం చేతికి పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగదు. వివిధ రకాల క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేసెస్ సాయంతో మీ మూడ్‌కి తగ్గట్టు స్క్రీన్ లుక్‌ను మార్చుకోవచ్చు.

360 హెల్త్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్:

Advertisement

ఆరోగ్యం కోసం ఇందులో అద్భుతమైన ఫీచర్లు అందించారు. ఇది 24/7 డైనమిక్ హార్ట్ రేట్ మానిటరింగ్‌తో పాటు,రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే SpO2 సెన్సార్‌ను కలిగి ఉంది. నిద్ర పోతున్నప్పుడు.. మీ స్లీప్ సైకిల్‌ను విశ్లేషించే.. స్లీప్ మానిటర్ కూడా ఇందులో ఉంది. రన్నింగ్, సైక్లింగ్, యోగా వంటి వంద లాది స్పోర్ట్స్ మోడ్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. మీరు రోజూ ఎన్ని కేలరీలు బర్న్ చేశారు. ఎంత దూరం నడిచారనే వివరాలను ఇది కచ్చితంగా ట్రాక్ చేస్తుంది.

బ్యాటరీ బ్యాకప్, ఇతర ఫీచర్లు:

రోజూ ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ లేకుండా.. ఉండేందుకు ఇందులో పవర్ ఫుల్ బ్యాటరీని ఇచ్చారు. సాధారణ వాడకంలో.. ఇది దాదాపు 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అలాగే.. స్టాండ్‌బై మోడ్‌లో 15 రోజుల వరకు పని చేస్తుంది. అంతే కాకుండా.. IP67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉండటం వల్ల వర్షపు చినుకులు లేదా చెమట పడ్డా వాచ్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదు. మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, వెదర్ అప్‌డేట్స్, రిమైండర్లు వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. విసుగు పుట్టినప్పుడు సేద తీరేందుకు బిల్ట్-ఇన్ గేమ్‌లు కూడా ఇందులో అందించడం విశేషం.

Advertisement

Also Read: రూ.908కే అద్భుతమైన సౌండ్..బడ్జెట్ ధరలో సూపర్ బేస్

ధర:

ఈ ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌ వాచ్ ధర విషయానికి వస్తే.. దీని అసలు ధర మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ..ప్రస్తుతం ప్రత్యేక డిస్కౌంట్‌లతో.. కేవలం రూ.1,299 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, స్టైలిష్ లుక్ కోరుకునే కస్టమర్లకు ఇది నిజంగా ఒక గొప్ప డీల్ అని చెప్పొచ్చు.

మీ చేతికి ఒక మోడ్రన్ లుక్‌ని ఇస్తూ.. మీ ఆరోగ్యాన్ని నిరంతరం కాపాడుకునే.. మంచి స్మార్ట్‌ వాచ్ కోసం చూస్తున్నట్లయితే.. ‘Fire-Boltt Hurricane’బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో లభించే బెస్ట్ ఫీచర్ల కారణంగా ఇది ప్రస్తుతం మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతోంది.

Related News

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో కొత్త ఇయర్ బడ్స్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు

47% డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీ..ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్.. 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న పవర్ సేవింగ్ ట్రిక్ ఇదే!

ఏసీ కొనడానికి ఇదే రైట్ టైమ్.. చలికాలంలో కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!

iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!

నిమ్మకాయను మైక్రోవేవ్‌లో ఉంచితే ఏమవుతుందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ ట్రిక్!

Big Stories

Advertisement
×