E-Paper
Advertisement

ఫీజు బకాయిలు ఇవ్వరు కానీ లక్షల ఫైన్లా? ఇంటర్ బోర్డు వైఖరిపై ప్రైవేట్ కాలేజీల సంఘం ఆగ్రహం!

ఫీజు బకాయిలు ఇవ్వరు కానీ లక్షల ఫైన్లా? ఇంటర్ బోర్డు వైఖరిపై ప్రైవేట్ కాలేజీల సంఘం ఆగ్రహం!
Advertisement

Budget Colleges: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ, పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న చిన్న, బడ్జెట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలను సర్వనాశనం చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ మాట్లాడుతూ.. ఒకవైపు కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలు గాలికొదిలేసి వేలాది అడ్మిషన్లు చేసుకుంటుంటే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న బోర్డు అధికారులు.. చిత్తశుద్ధితో నడుస్తున్న బడ్జెట్ కాలేజీలపై మాత్రం పెనాల్టీలు, జీరో అడ్మిషన్లు, అఫిలియేషన్ రద్దుల పేరిట విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వేసి బడ్జెట్ కాలేజీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 27 కాలేజీలకు ‘జీరో అడ్మిషన్’ ప్రకటించడం, 95కు పైగా కాలేజీలపై లక్షల రూపాయల జరిమానాలు విధించడం కేవలం బడ్జెట్ విద్యా సంస్థలను మూసివేయించే ముందస్తు వ్యూహమేనని మండిపడ్డారు. కార్పొరేట్ మాఫియా ప్రయోజనాల కోసమే బోర్డు ఉన్నతాధికారులు చిన్న కాలేజీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు.

అసాధ్యమైన నిబంధనలు పెట్టి వేధింపులు..

Advertisement

ప్రజల సంక్షేమం, విద్యాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత తీసుకొచ్చేందుకు బోర్డు సెక్రటరీ స్థాయి అధికారి ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని గౌరీ సతీశ్ మండిపడ్డారు. ప్రభుత్వం ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, పేద విద్యార్థులను కార్పొరేట్ కాలేజీల దోపిడీకి బలిచేసేలా చర్యలు ఉంటున్నాయన్నారు. ఏళ్ల తరబడి అనుమతులు ఉన్న భవనాలకు ఇప్పుడు అసాధ్యమైన నిబంధనలు పెట్టి, ఫైర్ ఎన్‌ఓసీ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని విరుచుకుపడ్డారు. వేలాది దరఖాస్తులు బోర్డు వద్దే పెండింగ్‌లో ఉంచి, అఫిలియేషన్లు నిలిపివేసి, విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించారు.

ఒక్కో కాలేజీపై రూ.8 లక్షల వరకు ఫైన్లు..

Advertisement

బోర్డు వ్యవస్థాగత వైఫల్యాలను కాలేజీల మీద రుద్దుతూ ఒక్కో కాలేజీపై రూ.8 లక్షల వరకు ఫైన్లు వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక అద్దెలు, సిబ్బంది జీతాలు చెల్లించలేక చిన్న కాలేజీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అటువంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సింది పోయి, రూ.లక్షల కొద్దీ జరిమానాలు విధించి కాలేజీలను బలిపీఠం ఎక్కిస్తున్నారని విమర్శించారు. బడ్జెట్ కాలేజీలను టార్గెట్ చేస్తూ విధించిన అక్రమ ఫైన్లు, జీరో అడ్మిషన్ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫైర్ ఎన్‌ఓసీ, అఫిలియేషన్ నిబంధనలను బడ్జెట్ కాలేజీల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరళతరం చేయాలన్నారు.

ఇంటర్ బోర్డు కార్యదర్శి తీరుపై ఉన్నతస్థాయి విచారణ

కార్పొరేట్ సంస్థల అక్రమాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, చిన్న కాలేజీలపై అధికారులు చూపుతున్న పక్షపాత వైఖరిని అరికట్టాలన్నారు. ప్రజా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి తీరుపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బోర్డు ఉన్నతాధికారులు తమ మొండి వైఖరిని విడనాడకపోతే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ హెచ్చరించారు.

Also Read: పనిచేయనప్పుడు పదవులెందుకు.. బీజేపీ నేతలకు బన్సల్ వార్నింగ్?

Tags

Related News

మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే దళారులకే అమ్ముకోండి.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు!

‘తెలంగాణ ఎండిపోతుంటే నీకేం పని అక్కడ’? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు!

కేటీఆర్.. ఆ సుద్దపూస మాటలు బంద్ చేయ్! మీ తప్పులు ప్రజలకు తెలుసు: ఎంపీ చామల

బొగ్గు కాదు.. ఇక సింగరేణిలో బంగారం, లిథియం తవ్వకాలు: భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్!

డిండి ఎత్తిపోతల పథకం పూర్తిగా రద్దు.. ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్!

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎల్ నినో విలయం.. 30 నుంచి 41 శాతం పడిపోయిన జలాలు!

హరీష్‌రావు పై మెట్టు సాయికుమార్ సంచలన ఆరోపనలు.. ఏమన్నారంటే?

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. కండక్టర్‌తో గొడవ… కాళ్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

Big Stories

Advertisement
×