E-Paper
Advertisement

Flipkart Big Billion Days sale 2024: నమ్మలేని ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లతో నథింగ్ ఫోన్లు, రూ.12,999లకే పొందొచ్చు!

Flipkart Big Billion Days sale 2024: నమ్మలేని ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లతో నథింగ్ ఫోన్లు, రూ.12,999లకే పొందొచ్చు!
Advertisement

Nothing Phone Offers: దేశ వ్యాప్తంగా ఉన్న ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ డిస్కౌంట్లతో అతి తక్కువ ధరలోనే వివిధ ప్రొడక్టులను కొనుక్కునేందుకు వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అందులోనూ ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల కోసం తహతహలాడుతున్నారు. ఈ సేల్ కింద కంపెనీ తన కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఫ్యాషన్, హోమ్ అప్లెయెన్సెస్ వంటి అనేక ఇతర ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందించనుంది.

ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కస్టమర్లందరికీ సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ సెప్టెంబర్ 26 నుండి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సేల్‌లో ఏ ఏ బ్రాండ్ ఫోన్లను ఏ ధరలో కొనుక్కోవచ్చో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అందులో వివో, శాంసంగ్, ఐక్యూ, షియోమి, రెడ్ మి, రియల్ మి, పోకో వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో బ్రాండ్ ఫోన్‌లు తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కొనుక్కోవచ్చు.

Advertisement

అతి తక్కువ సమయంలోనే దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న కంపెనీల్లో నథింగ్ ఒకటి. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లకు మార్కెట్‌లో సూపర్ డూపర్ డిమాండ్ ఉంది. మరి ఎప్పటి నుంచో నథింగ్ ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్‌ న్యూ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: ఆఫర్ అరాచకం.. రూ.75,999 ధర గల గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ రూ.30వేలకే!

Advertisement

Nothing Phone (2a), Nothing Phone (2a) Plus, CMF Phone 1 వంటి ఫోన్లపై భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లు బ్యాంక్ ఆఫర్‌లతో చాలా సరసమైన ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. ఇది మాత్రమే కాకుండా సేల్ సమయంలో నథింగ్ CMF వాచ్ ప్రో, బడ్స్ ప్రో 2 సహా అనేక వాటిపై కూడా భారీ తగ్గింపులు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

CMF Phone 1

CMF ఫోన్ 1 లాంచ్ సమయంలో రూ.15,999 ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దీనిని కేవలం రూ. 12,999కి సొంతం చేసుకోవచ్చు. CMF ఫోన్ 1ని కొనుగోలు చేసే వినియోగదారులకు CMF లాన్యార్డ్, స్టాండ్ కేవలం రూ.1కే అందుబాటులో ఉంటుంది, పవర్ 33W ఛార్జర్ కేవలం రూ.799కి లభిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా CMF బడ్స్ ప్రో 2, CMF బడ్స్ ప్రో, CMF నెక్‌బ్యాండ్ ప్రో, CMF వాచ్ ప్రోలను ఈ సేల్‌లో భారీ తగ్గింపులతో కొనుక్కోవచ్చు.

Nothing Phone (2a)

Nothing Phone (2a)పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధరపై ఫ్లిప్‌కార్ట్ రూ.4,000 తగ్గింపు, రూ. 1,000 బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. అంటే ఒకరకంగా చూస్తే ఈ ఫోన్‌పై రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతో ఈ ఫోన్‌ని అన్ని తగ్గింపులతో కలిపి రూ.18,999కి సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా పవర్ 65W ఛార్జర్‌ను కేవలం రూ.1,999కే అందిస్తోంది.

Nothing Phone (2a) Plus

నథింగ్ ఫోన్ (2a) ప్లస్‌పై కూడా కళ్లు చెదిరే ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.27,999 ఉండగా ఇప్పుడు భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో రూ. 2,000 తగ్గింపు, అలాగే మరో 2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రూ.4,000 తగ్గింపు తర్వాత Nothing Phone (2a) Plus ఫోన్‌ను రూ. 23,999 కి కొనుక్కోవచ్చు. అదే సమయంలో పవర్ 65W ఛార్జర్‌ను కేవలం రూ.1,999కే సొంతం చేసుకోవచ్చు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×