BigTV English

Google Pixel 8: ఆఫర్ అరాచకం.. రూ.75,999 ధర గల గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ రూ.30వేలకే!

Google Pixel 8: ఆఫర్ అరాచకం.. రూ.75,999 ధర గల గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ రూ.30వేలకే!

Google Pixel 8 Price Drop: గూగుల్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఐఫోన్ల మాదిరి అత్యధికంగా ధర ఉన్నా కొనేవారు లేకపోలేదు. ఐఫోన్లకు ఉన్న క్రేజ్ ఈ గూగుల్ ఫోన్లకు ఉంది. అందువల్లనే కంపెనీ కూడా కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే సమయంలో తమ ఫోన్ల సేల్స్ మరింత పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటించి ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫోన్‌ కొనుక్కునే ఆలోచన ఉన్నవారికి ఓ గుడ్ న్యూస్. గత ఏడాది భారతదేశంలో లాంచ్ అయిన Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. అదెలాగో తెలుసుకుందాం.


త్వరలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ సేల్‌ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 27న ఇది ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులకు సెప్టెంబర్ 26న అందుబాటులో ఉండనుంది. అయితే ఈ సేల్‌లో పిక్సెల్ 8పై భారీ తగ్గింపు పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.75,999కి విడుదల అయింది. ఇప్పుడు దీనిని సగం కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. కార్డ్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి డీల్స్ ద్వారా ఫోన్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Also Read: ఏంటి భయ్యా ఇది.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఐఫోన్‌లపై వేలల్లో డిస్కౌంటా? అతిపెద్ద ఆఫర్ అంటే ఇదే!


తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బిలియన్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.75,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.35,999కి కొనుక్కోవచ్చు. దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.1500 వరకు తగ్గింపు ఇవ్వబడుతుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 2500 వరకు ఎక్స్‌ట్రా ఎక్స్ఛేంజ్ వాల్యూ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా 10 సూపర్ కాయిన్స్‌తో రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లన్నీ కలిపితే ఫోన్‌ను రూ.29,999కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా నో కాస్ట్ ఇఎంఐం ఆప్షన్ కూడా ఉంది.

Google Pixel 8 Specifications

Google Pixel 8 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ ఆప్సన్‌ని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల FHD+ (1,080×2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో Google ఓన్ టెన్సర్ G3 చిప్‌సెట్ అందించబడింది. అదే సమయంలో Titan M2 సెక్యూరిటీ చిప్ వంటివి ఉన్నాయి. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది.

ఇందులో 8x సూపర్-రెస్ డిజిటల్ జూమ్‌తో కూడిన 50MP ఆక్టా-PD కెమెరా, ఆటోఫోకస్, మాక్రో సామర్థ్యాలతో 12MP సెకండరీ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఇంకా పిక్సెల్ 8 ఆటో ఫోకస్ సపోర్ట్‌తో 10.5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇక ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్సన్ల విషయానికొస్తే.. ఇది Wi-Fi 6E, 5G, 4G LTE, USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.3, GPS వంటివి ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. 27W వైర్డు, 18W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4575mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×