BigTV English

Koratala Siva about Chiru : కొరటాల కవరింగ్…

Koratala Siva about Chiru : కొరటాల కవరింగ్…

Koratala Siva about Chiru : “ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి. పక్కొడి పనుల్లో వేలు పట్టొద్దు…” ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా… కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివను యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వ్యూ చేశారు. దీంట్లో కొరటాల శివ ఈ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ మెగాస్టర్ చిరంజీవి గురించే చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే తాజాగా కొరటాల శివ వీటిపై రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్ధాం…


మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… వీరి కాంబోలో ఓ ఫుల్ లెన్త్ మూవీ వస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న రోజులవి. ఆ టైంలో ఒక్క ప్లాప్ లేకుండా ఓటమి ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ అనౌన్స్ చేశారు ఓ మూవీ. దానిలో హీరో మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఓ గెస్ట్ రోల్ ఉంటుందని, ఆ పాత్రను రామ్ చరణ్ చేస్తారని ఆయన అనౌన్స్ చేశారు. దీంతో చిరు – చరణ్ అనే కాంబో కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. కొరటాల అంటే హిట్ కి కేరాఫ్ ఆడ్రస్ కాబట్టి… సినిమా రికార్డ్స్ లెక్కబెట్టుకోవడమే అనుకున్నారు అందరూ. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఆచార్య మూవీ 2022 ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ అయింది.

Also Read : పాపం కార్తీ… లడ్డూ చూపించి గుండు కొట్టించింది…


ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మూవీ కావడంతో అంచనాలు కూడా అదే రేంజ్‌లో ఉండేవి. అయితే, రిలీజ్ అయిన రోజు మెగా ఫ్యాన్స్ కు ఓ పీడ కలగా మారిపోయింది. సినిమా ఎక్కడా కూడా ఎంటర్టైన్ చేయలేకపోయింది. దీంతో కొరటాల శివ కెరీర్ లో ఫస్ట్ ప్లాప్ పడిపోయింది. ఇదే టైంలో ఆయనపై ట్రోల్స్ కూడా భారీగా పెరిగాయి.

అయితే, ఈ ట్రోల్స్ జరుగుతున్న టైంలో కొంత మంది కొరటాలకు సపొర్ట్ కూడా చేశారు. కొరటాల కరెక్ట్ గానే ప్లాన్ చేశారని, అయితే చిరంజీవి కథలో వేలు పెట్టడం వల్లే ఇలా జరిగిందని ఇరత హీరోల ఫ్యాన్స్ కామెంట్ చేశారు. రామ్ చరణ్ పాత్ర 15 మినిట్స్ నుంచి 45 మినిట్స్ కి పెంచింది చిరంజీవినే అని, అందువల్లే ఆచార్యకు ఇలాంటి రిజెల్ట్ వచ్చిందని మెగా ఫ్యామిలీని ట్రోల్ చేశారు.

ఇది జరిగి రెండేళ్లు అయినా… ఏం తగ్గలేదు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర మూవీ రిలీజ్ టైంలో ఆచార్య గురించి చర్చ మరింత ఎక్కువ అయింది. ఇక విశ్వక్, సిద్ధుతో జరిగిన ఇంటర్వ్యూలో కొరటాల చేసిన కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరోసారి ఆచార్య గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వార్స్ చేసుకునే పరిస్థితి వచ్చింది.

అయితే దీనిపై కొరటాల శివ స్పందించారు. ఆచార్య తర్వాత తాను కష్టాల్లో ఉన్నప్పుడు మెగాస్టారే ఫస్ట్ మెసేజ్ చేశారని అన్నారు. “యు విల్ బౌన్స్ బ్యాక్ శివ” అంటూ చిరంజీవి మెసేజ్ చేశారని గుర్తు చేశారు. ఇంటర్వ్యూలో తాను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని కొరటాల శివ చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఆచార్య కామెంట్స్ పై జరిగిన రచ్చకు బ్రేక్ పడింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×