BigTV English
Advertisement

Flipkart Big Billion Days sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వీటిని భారీ తగ్గింపుతో కొనేయొచ్చు!

Flipkart Big Billion Days sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వీటిని భారీ తగ్గింపుతో కొనేయొచ్చు!

Flipkart Big Billion Days sale 2024: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫాం ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంది. రకరకాల సేల్‌ను తీసుకొస్తూ వివిధ ప్రొడక్టులపై డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవలే మరో కొత్త సేల్‌ను అనౌన్స్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్2024ను సెప్టెంబరు 27న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో అనేక ప్రొడక్టులు డిస్కౌంట్ల ఆఫర్‌లతో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.


అలాగే ఫ్లిప్‌కార్ట్ పలు స్మార్ట్‌ఫోన్‌లపై ప్రముఖ డీల్స్‌ను అందిస్తున్నట్లు టీజర్‌ కూడా రిలీజ్ చేసింది. ఈ సేల్‌లో భాగంగా నథింగ్ TWS, నథింగ్ CMF ప్రొడక్టులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. వీటిలో కొన్ని నథింగ్ ఇయర్ (a), CMF బడ్స్, బడ్స్ ప్రో, CMF వాచ్ ప్రో 2, CMF బడ్స్ ప్రో 2 వంటివి ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నథింగ్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందు తన ప్రొడెక్టులపై డిస్కౌంట్లు అనౌన్స్ చేసింది. ఆఫర్ ధరలు Flipkartలో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి.

Nothing Ear (a), Nothing Ear: నథింగ్ ఇయర్, ఇయర్ (ఎ) వరుసగా రూ.11,999, రూ.7,999 వద్ద లాంచ్ చేయబడ్డాయి. ఈ రెండు ప్రొడక్టుల ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. దాదాపు రూ.8,999, రూ.5,999 తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. నథింగ్ ఇయర్‌‌, ANC 40.5 గంటల బ్యాటరీ లైఫ్‌తో IP55 రేటింగ్‌ను పొందాయి. ఇయర్ (a) కూడా ANCని కలిగి ఉంది. ఇది సన్నని ఫ్రేమ్‌తో వస్తుంది. అదే సమయంలో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.


Also Read: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

CMF Watch Pro: CMF వాచ్ ప్రో కేవలం రూ.3,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడ్డాయి. సేల్‌లో భాగంగా దీనిని రూ.2,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ 1.96 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 110 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. 13 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

CMF Buds Pro 2, Buds Pro, Buds: CMF బడ్స్ ప్రో 2 జూలైలో CMF ఫోన్ 1తో పాటు లాంచ్ చేయబడింది. దీని ధర విషయానికొస్తే.. ఇది రూ.4,299 ధరతో లాంచ్ కాగా ఇప్పుడు కేవలం రూ.3,499కి అందుబాటులో ఉంది. ఇది 50dB స్మార్ట్ ANC, హై-రెస్ ఆడియో, కస్టమైజబుల్ స్మార్ట్ డయల్‌తో వస్తుంది.

CMF బడ్స్ ప్రో అనేది చౌకైన ప్రొడెక్ట్. దీని అసలు ధర రూ.2,999 ఉండగా.. దీన్ని రూ.2,499కి పొందవచ్చు. దీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 45dB, గరిష్టంగా 11 గంటల బ్యాటరీ లైఫ్‌ని పొందుతారు. 1st జెన్ CMF బడ్స్ కూడా రూ.2,499 అసలు ధర ఉండగా ఇప్పుడు రూ.1,999కి కొనుక్కోవచ్చు.

CMF Neckband Pro: CMF నెక్‌బ్యాండ్ ప్రో అసలు ధర రూ.1,999 ఉండగా ఇప్పుడు రూ.1,799కి సొంతం చేసుకోవచ్చు. ఇది 50dB హైబ్రిడ్ ANC, ఐదు HD మైక్‌లు, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP55 రేటింగ్‌ను కలిగి ఉంది.

Related News

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vivo Y500 Pro: త్వరలో Vivo Y500 Pro లాంచ్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Apple iPhone 18: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో వచ్చేస్తోన్న

Moto G67 Power: 7,000mAh బ్యాటరీ, 6.7 ఇంచుల డిస్ ప్లే.. రిలీజ్ కు ముందే Moto G67 స్పెసిఫికేషన్లు లీక్!

Lava Agni 4: త్వరలో లావా అగ్ని 4 లాంచింగ్.. డిజైన్, స్పెసిఫికేషన్లు అదుర్స్ అంతే!

Free ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ ఫ్రీ.. ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

Big Stories

×