BigTV English

Lava Festive Season Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

Lava Festive Season Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

Festive Season Sale: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. పండుగ సీజన్ వచ్చేస్తుంది. ఈ తరుణంలో ప్రముఖ టెక్ బ్రాండ్ లావా తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌పై ప్రత్యేక ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లు ఈ నెల అంటే సెప్టెంబర్ చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ Amazon.inలో సొంతం చేసుకోవచ్చు. ఈ లావా స్మార్ట్‌ఫోన్ సిరీస్‌పై బ్యాంక్ ఆఫర్‌లు, EMI, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


Lava Blaze Curve 5G

Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్ రూ.14,999 లకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 120Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో ఆధారితం అయింది. 570K కంటే ఎక్కువ Antutu స్కోర్‌ను సాధించింది. కాగా ఈ ఫోన్ ఐరన్ గ్లాస్, విరిడియన్ గ్లాస్ కలర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుందని చెప్పబడింది. కెమెరా సెటప్‌లో EISతో కూడిన 64MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.


Lava Blaze 3 5G

Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ తాజా ఆఫర్లతో అతి తక్కువకే లభిస్తుంది. దీనిని రూ. 9,999 ధరతో కొనుక్కోవచ్చు. ఇది MediaTek D6300 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ వైబ్ లైట్ తక్కువ లైట్ ఫోటోగ్రఫీని మెరుగుపరుస్తుంది.

Lava Yuva 3

Also Read: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

Lava Yuva 3 ధర విషయానికొస్తే.. ఇది రూ.6,699 ధరలో అందుబాటులో ఉంది. Lava Yuva 3 మొబైల్ UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది సులభంగా యాక్సెస్ చేయడానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌తో HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇంకా ఈ మొబైల్ 13MP ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇది Android 13 OSలో నడుస్తుంది.

Lava Blaze X

లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ కూడా తక్కువ ధరకు లభిస్తుంది. ఇది రూ.14,999 ధరతో లభిస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా ఫోన్ సేఫ్టీ కోసం ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ఆధారితం అయింది. ఇది 8GB+8GB వరకు RAM ఆప్షన్‌లతో వస్తుంది. అలాగే స్టార్‌లైట్ పర్పుల్, టైటానియం గ్రే వంటి కలర్‌లలో ఇది లభిస్తుంది.

Lava O3

Lava O3 ఫోన్ మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇది రూ. 5,599 ధరలో అందుబాటులో ఉంటుంది. 6.75 అంగుళాల పెద్ద HD+ నాచ్ డిస్ప్లే‌తో వచ్చింది. ఇది సున్నితమైన పనితీరు కోసం 4GB+4GB వరకు RAM ఆప్షన్‌లో ఆక్టా-కోర్ UNISOC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ మోడల్‌లో 13MP వరకు రిజల్యూషన్ ఉన్న డ్యూయల్ AI వెనుక కెమెరాలు, అలాగే 5MP వరకు రిజల్యూషన్ ఉన్న ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది యూజర్ ఫ్రెండ్లీ నావిగేషన్ కోసం Android Go OSలో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నీ బలమైన బ్యాటరీలతో అమర్చబడి ఉంటాయి. అందువల్ల తక్కువ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇవి బెస్ట్‌గా చెప్పుకోవాలి.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×