Flipkart Big Sale: దీపావళి పండుగ సీజన్ ముగిసినా కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల హడావిడి మాత్రం ఇంకా తగ్గలేదు. మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నా, ఫ్లిప్‌కార్ట్ మాత్రం తగ్గింపులతోనే వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పండుగ కాంతులు మసకబారినా, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల వెలుగులు మాత్రం ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్లు అన్నీ ఇప్పటికీ భారీ తగ్గింపులతో లభిస్తున్నాయి.
వివో టి4 సిరీస్ 5జి ఫోన్లు రూ.15,000 డిస్కాంట్
ముందుగా వివో అభిమానుల కోసం వచ్చిన వివో టి4 సిరీస్ 5జి ఫోన్లు ఇప్పుడు కేవలం రూ.8,999 నుంచే అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఉన్న ధరతో పోలిస్తే ఈసారి దాదాపు రూ.25,000 వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎస్‌బిఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ.15,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా వస్తోంది. కొత్త డిజైన్, మంచి కెమెరా క్వాలిటీ, వేగవంతమైన 5జి కనెక్టివిటీతో ఈ ఫోన్ యువతకు మరింత ఆకర్షణీయంగా మారింది. దీపావళి ముగిసినా వివో ప్రేమికులకి ఇంకా పండుగే కొనసాగుతోందని చెప్పాలి.
ఒప్పో కె13ఎక్స్ 5జి ఫోన్ 10 శాతం డిస్కౌంట్
ఇదేలా ఉంటే ఒప్పో కూడా వెనుకబడలేదు. ఒప్పో కె13ఎక్స్ 5జి ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.9,499 నుంచే అందుబాటులో ఉంది. దీన్ని ఈ ఏడాది బిగ్గెస్ట్ పరిచే డ్రాప్ అఫ్ ది ఇయర్ గా ప్రకటించారు. అంటే ఇంత పెద్ద తగ్గింపు ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదన్నమాట. ఆకర్షణీయమైన లుక్, శక్తివంతమైన బ్యాటరీ, సూపర్ పనితీరు అన్నీ కలిపి ఈ ఫోన్ ఇప్పుడు టెక్ లవర్స్ కలల డీల్‌గా మారింది. దీని మీద కూడా ఎస్‌బిఐ బ్యాంక్ కార్డు ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.
Also Read: Jio Free Data Offer: జియో బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 50జిబి ఉచిత స్టోరేజ్
ల్యాప్‌టాప్ లవర్స్ అదిరిపోయే ఆఫర్లు
మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్ లవర్స్ కోసం కూడా ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లు తెచ్చింది. ఇంటెల్ కోర్ ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు కేవలం రూ.20,990 నుంచే ప్రారంభమవుతున్నాయి. వర్క్, స్టడీస్, గేమింగ్ ఏ అవసరమైనా సరే ఈ ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు బడ్జెట్‌లోనే సరిపోతున్నాయి. బ్యాంక్ ఆఫర్లు కలిపి చూస్తే ధరలు మరింత తక్కువవుతున్నాయి. ఎస్‌బిఐ కార్డుతో కొంటే 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.
మరిన్ని ఆఫర్లు మీకోసం
దీపావళి అయిపోయినా ఈ ఆఫర్లు మాత్రం ఇంకా వేడెక్కిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాదు, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ ఐటమ్స్ అన్నీ షాకింగ్ తగ్గింపులతో లభిస్తున్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని వదలకుండా స్మార్ట్ షాపింగ్ చేస్తూ తమకు కావాల్సిన వస్తువులు బుక్ చేసుకుంటున్నారు.
ఆఫర్లు ఎప్పటి వరకు
అయితే ఈ ఆఫర్లు కేవలం అక్టోబర్ 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ధరలు మళ్లీ పెరగనున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్ చేసి మీ ఫేవరేట్ ప్రోడక్ట్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఎందుకంటే దీపావళి అయిపోయినా, ఆఫర్ల వెలుగులు మాత్రం ఇంకా ఆగలేదు.