BigTV English

Inter Students: ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ ఎంజాయ్.. కలిసొచ్చిన అరమార్క్, పాతవారిని నో ఛాన్స్

Inter Students: ఏపీలో ఇంటర్ స్టూడెంట్స్ ఎంజాయ్.. కలిసొచ్చిన అరమార్క్, పాతవారిని నో ఛాన్స్
Advertisement

Inter Students: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ బోర్డులో ఊహించని మార్పులు చేస్తోంది. విద్యార్థులకు అనుకూలంగా ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తోంది బోర్డు. తాజాగా ప్రాక్టికల్స్‌ ఉన్న సబ్జెక్టుల పరీక్షల్లో అర మార్కు సడలింపు ఇచ్చింది ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు. దీంతో విద్యార్థులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.


ఏపీ ఇంటర్ పరీక్షలో మార్పులు

పబ్లిక్ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు అర లేదంటే ఒక్క మార్కులో ఫెయిల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  చాలామంది దురదృష్టంగా భావిస్తుంటారు. ఏపీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలుచేస్తోంది. దీంతో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.


ఇంటర్మీడియట్ విద్యా విషయానికి వద్దాం. రెండేళ్లలో విద్యార్థుల రాత పరీక్షలో అర మార్కు తక్కువ వచ్చినా పర్వాలేదు. వారు పాస్ అయినట్టుగానే నే పరిగణించనుంది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు స్వయంగా వెల్లడించింది. తగ్గించిన అర మార్కు సెకండ్ ఇయర్ లో నిర్వహించే ప్రాక్టికల్స్‌లో సర్దుబాటు చేసింది.

అర మార్కు తగ్గినా పాసైనట్టే

ఇంటర్ ఫస్టయర్‌లో భౌతిక, రసాయన, జీవశాస్త్ర సబ్జెక్టులకు 85 మార్కులకు పరీక్ష ఉంటుంది. 100 కు 35 మార్కుల చొప్పున 85 మార్కులకు 29.75 మార్కులు రావాలి. అరమార్కు తగ్గినా విద్యార్థులు ఫెయిల్ అవుతుంటారు. అయితే ఫస్టియర్‌లో 29 మార్కులకు తగ్గించింది ఇంటర్ బోర్డు. సెకండ్ ఇయర్‌లో 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన తెచ్చింది.

రెండు సంవత్సరాలు కలిపి 35 శాతం మార్కుల కింద 59.50 మార్కులు సాధించాలి. 59 మార్కులను ఉత్తీర్ణతగా నిర్ణయించారు బోర్డు అధికారులు. అయితే అరశాతం మార్కుని సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్‌లో పెంచారు. 30 మార్కులకు గాను ఉత్తీర్ణత కావడానికి 10.5 శాతం ఉండేది. కొత్త నిబంధన ప్రకారం 11 మార్కులకు పెంచారు.

ALSO READ:  ఏపీకి పెట్టుబడులు..  దుబాయ్‌కి సీఎం చంద్రబాబు

ఈ లెక్కన ఇంటర్ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులొచ్చినా పాస్ అయినట్టే. ఓవరాల్‌గా చూస్తే 35 శాతం రావాలి. ఏదైనా ఓ సబ్జెక్టులో అత్యధిక మార్కులు వచ్చి, మిగతావాటిలో 30 శాతం మార్కులు వచ్చినా పాసైనట్టే. గతంలో ఉండే నిబంధనను ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నారు.

ఇక జాగ్రఫీ సబ్జెక్ట్ పరీక్ష గతంలో 75 మార్కులకు నిర్వహించి 85 మార్కులకు లెక్కించేవారు. ఫస్టియర్‌కు 15, సెకండియర్‌కు 15 కలిపి రెండేళ్లలో 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. అంతేకాదు తొలిసారి ఈ ఏడాది నుంచి ఇంటర్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఛాయిస్‌ ఉండదన్న విషయం విద్యార్థులు తెలుసుకోవాలి.

వృక్ష-జంతుశాస్త్రం కలిపి జీవశాస్త్రంగా తీసుకొచ్చారు అధికారులు. అందులో వృక్షశాస్-43 మార్కులు, జంతుశాస్త్రం-42 మార్కులకు ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూప్‌లో ఐదు సబ్జెక్టులు కాకుండా ఆరోది ఎంపిక చేసుకున్నవారు, ఆ సబ్జెక్టు ఉత్తీర్ణత తప్పనిసరి కాదు. దీనికి ప్రత్యేకంగా మెమో జారీ చేస్తారు అధికారులు. ఈ నిబంధనలు కొత్తగా పరీక్షలు రాస్తున్నవారికి మాత్రమే. పాతవారికి వర్తించవు.

Related News

CM Chandrababu Visit UAE: టార్గెట్ ఏపీకి పెట్టుబడులు.. దుబాయ్‌కి సీఎం చంద్రబాబు

Kandukuru Case: కందుకూరు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. బాధితులకు పరిహారం ప్రకటించిన సీఎం

Nara Lokesh: ఏపీ – తమిళనాడు – కర్నాటక.. ట్రయాంగిల్ ఫైట్ లో మోదీని మెప్పించిన లోకేష్

Srisailam Karthika Masam: శివ భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు షురూ

AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ.. డీజీపీ వద్ద పంచాయితీ

Big Stories

×