రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే హెలిప్యాడ్ కుంగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగింది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ పట్టుకుని ముందుకు నెట్టారు. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రపతి ఇవాళ కేరళ పర్యటనకు వెళ్లారు. కొచ్చిలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండ్ కాగా, ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా హెలికాఫ్టర్ ట్రయల్స్ చేసినా, ఈ ప్రమాదం ఎలా జరిగింది? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
ల్యాండ్ అవుతుండగా కుంగిన హెలిప్యాడ్.. రాష్ట్రపతికి తప్పిన పెను ప్రమాదం..
కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో హెలిప్యాడ్ కుంగిపోవడంతో ఓవైపుకు ఒరిగిన హెలికాప్టర్
రాష్ట్రపతిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి
హెలికాప్టర్ ను నెట్టుకుంటూ పక్కకు చేర్చిన పోలీస్, ఫైర్… pic.twitter.com/nvnWxU9rhp— BIG TV Breaking News (@bigtvtelugu) October 22, 2025
Read Also: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్