BigTV English

Discount on Samsung Galaxy: ఊరమాస్ డీల్.. సగం ధరకే సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. ఆఫర్ ఎక్కువసేపు ఉండదు!

Discount on Samsung Galaxy: ఊరమాస్ డీల్.. సగం ధరకే సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. ఆఫర్ ఎక్కువసేపు ఉండదు!

Bumper Discount Samsung Galaxy F14 5G Mobile: ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రిక్ పరికరాలపై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. భారీగా తగ్గింపులతో స్మార్ట్‌ఫోన్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం మీరు కూడా రూ. 10,000 లోపు మంచి బ్రాండెడ్ 5G ఫోన్ కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy F14 5G 6000 mAh బ్యాటరీ, 6 GB RAM+ 128 GB స్టోరేజ్‌తో వస్తుంది. అంతే కాకుండా ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ కూడా ఉంది. ఫోన్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ తదితర వివరాల గురించి తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy F14 5G 6 GB RAM + 128 GB స్టోరేజ్ ధర రూ. 18,490గా ఉంది. అయితే ఫోన్‌పై 48 శాతం తగ్గింపుతో రూ. 9,499లకే అందిస్తోంది. అంటే మీరు ఫోన్‌తో నేరుగా రూ.9,000 తగ్గింపును పొందుతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఫోన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై కూడా 5 శాంత క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అంటే ఆఫర్ కార్డ్‌తో మీరు Samsung Galaxy F14 5Gని రూ. 9 వేల కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు.

SAMSUNG Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ఫోన్‌లో  6.6 అంగుళాల FullHD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ ఆక్టాకోర్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్, 6 GB RAM వరకు, 128 GB స్టోరేజ్‌ను ప్యాక్ చేస్తుంది. మీరు మైక్రో SD కార్డ్ సహాయంతో కూడా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.


Also Read: Vivo కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఇంత తక్కువకు ఎలారా బాబు!

SAMSUNG Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇది 13MP కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో 13 5G బ్యాండ్‌లు, ఆడియో జాక్ కూడా ఉన్నాయి. అయితే ఫోన్ ఉన్న బాక్స్‌లో ఛార్జర్ అందుబాటులో లేదు. మీరు ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి.

Tags

Related News

Plants: మొక్కలకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? అవి ఎలా ప్రతిస్పందిస్తాయంటే?

Redmi 15 5G vs Honor X7c 5G: ₹14,999 ధరకు ఏది బెస్ట్?

Designer IQ Babies: ఏఐతో పోటీపడే చిచ్చరపిడుగులు.. తెలివైన పిల్లలు పుట్టేందుకు గర్భంలోనే ఇంజినీరింగ్

Galaxy F06 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. గెలాక్సీ బడ్జెట్ ఫోన్ రూ.8200కే..

Youtube Hype: యుట్యూబ్‌ చిన్న క్రియేటర్‌లకు గుడ్ న్యూస్.. ఈ ఫీచర్‌తో వీడియోలు వైరల్!

Vivo T4 Pro vs Realme P4 Pro: మిడ్-రేంజ్‌లో రెండు కొత్త ఫోన్లు.. ఏది కొనాలి?

Big Stories

×