BigTV English

Yakshini Trailer: మగవారు జాగ్రత్త.. అందాల యక్షిణి సొగసు చూపించి చంపేస్తుంది!

Yakshini Trailer: మగవారు జాగ్రత్త.. అందాల యక్షిణి సొగసు చూపించి చంపేస్తుంది!

Manchu Lakshmi, Vedika, Rahul Vijay Starrer Yakshini Trailer: యక్షిణి.. ఈ పేరు చాలామంది కథల్లో వినే ఉంటారు. ఒక అందాల భామ సముద్రం ఒడ్డున సొగసంతా చూపిస్తూ తన ప్రియుడు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అటువైపుగా వెళ్లిన ఏ మగవాడిలోనైనా ఆమె తన ప్రియుడినే చూస్తోంది. ఇక యక్షిణి అని ఆమె పేరు పలికిన వెంటనే ప్రత్యేక్షయమయ్యి .. తన అందచందాలతో మైమరిపించి.. ఆ మగవాడిని లొంగదీసుకుని చివరకు చంపేస్తుంది. ఇది యక్షిణి కథ. కామపిశాచిగా యక్షిణిని కథల్లో విన్నాం.


ఇక ఇప్పుడు అదే యక్షిణి కథ సిరీస్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు బాహుబలి మేకర్స్. ఈ మధ్యకాలంలో హర్రర్ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆ లిస్ట్ లో యక్షిణి కూడా చేరనుంది. విద్యావాసుల అహం సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ విజయ్.. ఈసారి యక్షిణితో భయపెట్టడానికి రెడీ అయ్యాడు. అతను హీరోగా తెరకెక్కిన హార్రర్ వెబ్ సిరీస్ యక్షిణి.

హీరోయిన్ వేదికగా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. మంచు లక్ష్మీ, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మానవుడుతో శారీరక సంబంధం పెట్టుకున్న కారణంగా మాయ అనే దేవకన్య శాపానికి గురి అవుతుంది. ఆ శాప విముక్తి కావాలంటే 100 మంది మగవాళ్ళను తన అందచందాలను చూపించి.. వారు ప్రేమలో ముంగి, శృంగారంలో ఉన్నప్పుడే చంపాలి.


Also Read: Neena Gupta: బోల్డ్ యాక్టర్ నీనా గుప్తా ఇకలేరు.. అలాంటి ట్యాగ్ లు అంటగట్టకండి

అలా 99 మంది మగవారిని చంపిన పిమ్మట వందవ మగాడిని చంపడానికి మాయ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ 100 వ మగాడు ఆజన్మ బ్రహ్మచారి అయ్యి ఉండాలి అని కండీషన్ ఉండడంతో ఆమె కన్ను కృష్ణ మీద పడుతుంది. పెళ్లి అంటేనే ఆమడదూరం పరిగెత్తే కృష్ణ.. మాయ ప్రేమలో పడి పెళ్లివరకు వెళ్తాడు. ఇక భర్త ప్రేమకు లొంగిపోయి.. మాయ, కృష్ణను కాపాడుతుందా.. ? అలకాపురిని కాపాడడానికి ఆమె భర్తను చంపి తమ లోకానికి వెళ్లిపోతుందా.. ? అనేది తెలియాలంటే యక్షిణిని చూడాల్సిందే. జూన్ 14 న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హోస్ట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో వేదిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×