E-Paper
Advertisement

POCO M6 Pro @ Rs 1,999: బంపరాఫ‌ర్.. బ‌డ్జెట్ స్మార్ట్ వాచ్ ధ‌ర‌కే 5జీ మొబైల్.. ఆఫర్ మిస్ చేయ‌కండి!

POCO M6 Pro @ Rs 1,999: బంపరాఫ‌ర్.. బ‌డ్జెట్ స్మార్ట్ వాచ్ ధ‌ర‌కే 5జీ మొబైల్.. ఆఫర్ మిస్ చేయ‌కండి!

POCO M6 Pro 5g Mobile Price Droped: ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రికి మొబైల్ ఫోన్ ఒక వ్య‌స‌నంలా మారిపోయింది. చిన్న పిల్ల‌ల నుంచి పండు ముస‌లివాళ్ల వ‌ర‌కు ప్ర‌తిఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్‌ను వాడేస్తున్నారు. అందువ‌ల్లనే ఇప్పుడు మొబైళ్ల‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఫోన్ ప్రియుల‌ను ఆక‌ర్షించేందుకు ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త మోడ‌ళ్ల‌లో ర‌క‌ర‌కాల వేరియంట్ల‌ను ప‌రిచయం చేస్తున్నాయి.

అయితే మొబైల్ కంపెనీలు కూడా ఫోన్ ప్రియుల టేస్ట్‌కి త‌గ్గ‌ట్టుగా అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటున్నాయి. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా కొత్త కొత్త మోడ‌ళ్ల‌ను ప‌రిచ‌యం చేస్తున్నాయి. వీటిని మార్కెట్లోకి భారీ ధ‌ర‌తో తీసుకువ‌స్తున్నాయి. అయితే ఫీచ‌ర్లు అద్భుతంగా ఉన్నా.. భారీ ధ‌ర కార‌ణంగా చాలామంది వీటిని కొనేందుకు వెన‌క‌డుగు వేస్తున్నారు.

అందువ‌ల్ల అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్. త‌క్కువ ధ‌ర‌లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాల‌ని ప్లాన్ చేస్తున్న‌వారికి క‌ళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. బ‌డ్జెట్ ధ‌రలో మంచి ఫోన్ కొనుక్కోవాల‌ని అనుకునే వారికి ఇదొక అద్భుత‌మైన అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. అయితే మ‌రి ఏ ఫోన్ పై ఆఫ‌ర్ వ‌స్తుంది.. ఎంత‌మేర డిస్కౌంట్ పొందొచ్చు. ఎందులో సొంతం చేసుకోవచ్చు అనే వివ‌రాల‌ను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

poco m6 pro 5g mobile price drop

Also Read: ఇన్ఫినిక్స్ న్యూ స్మార్ట్ ఫోన్.. మరే ఫోన్‌లో లేని ఫీచర్‌తో లాంచ్!

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో 5జీ స్మార్ట్ ఫోన్ పై ఎవ‌రూ ఊహించ‌ని డిస్కౌంట్ ఆఫ‌ర్ అందుబాటులో ఉంది. ప్ర‌ముఖ బ్రాండెడ్ కంపెనీ పోకోకి చెందిన 5జీ మొబైల్ పై మంచి డిస్కౌంట్ ను సొంతం చేసుకోవ‌చ్చు. పోకో ఎం 6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫ‌ర్ ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ మొబైల్ ధ‌ర రూ.15,999 గా కంపెనీ నిర్ణ‌యించింది.

అయితే ఇప్పుడు దీన్ని మ‌రింత త‌క్కువ ధ‌ర‌కే ఫ్లిప్ కార్ట్‌లో సొంతం చేసుకోవ‌చ్చు. ఈ ధ‌ర‌పై ఫ్లిప్ కార్ట్ 37 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో అప్పుడు ఈ ఫోన్ రూ.9,999కి దొరుకుంది. దీంతో పాటు ప‌లు బ్యాంక్ ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 500 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే దీంతో పాటు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ల‌భిస్తుంది.

Also Read: Poco C 51 @ Rs 4,999: సూపర్ క్రేజీ ఆఫర్ భయ్యా.. 4,999కే స్మార్ట్ ‌ఫోన్!

ఈ ఫోన్ పై దాదాపు రూ.7500 వ‌ర‌కు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫ‌ర్ పూర్తిగా వ‌ర్తిస్తే కేవ‌లం రూ.1999 కే 5జీ ఫోన్ ను కొనుక్కోవ‌చ్చు. అయితే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ మంచి కండీష‌న్ క‌లిగి ఉండాలి. అప్పుడు మాత్ర‌మే ఈ ఫోన్ పై ఫుల్ గా డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. లేదంటే మీ జేబులో నుంచి మ‌రింత డ‌బ్బులు పెట్టాల్సి ఉంటుంది. కాగా ఈ ఆఫ‌ర్ అనేది 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ల‌భిస్తుంది.

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×