BigTV English

RS Praveen Kumar Resign : బీఎస్పీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

RS Praveen Kumar Resign : బీఎస్పీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
rs praveen kumar resigned to bsp party
rs praveen kumar resigned to bsp party

RS Praveen Kumar Resigned to BSP(Telangana news updates ) : బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పోటీ చేసేందుకు సిద్ధమైన బీఎస్పీ.. సీట్ల కేటాయింపుపై కేసీఆర్ తో సుదీర్ఘ చర్చలు కూడా జరిపింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఆయన బీఎస్పీకి రాజీనామా చేయడం సంచలనమైంది.


ఈ మేరకు ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. “బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. మళ్లీ చెబుతున్నా.. చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా” అని అందులో రాసుకొచ్చారు.

ఇకపై కొత్త మార్గంలో ప్రయాణించక తప్పడం లేదని, అందుకే పార్టీని వీడుతున్నట్లు వివరించారు. తెలంగాణలో బీఎస్పీ భవిష్యత్ కార్యాచరణపై తర్వాతి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీఎస్పీదేనని ఆయన పేర్కొన్నారు. అయితే బీఎస్పీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్రకటించిన కొద్ది సేపటికే ప్రవీణ్ కుమార్.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. దీంతో వీరిద్దరి భేటి వెనుకు ఏదో బలమైన కారణమే ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×