BigTV English
Advertisement

Flipkart New Sale 2024: అబ్బా కుమ్మేశారు.. ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌లో ఇన్ని ఆఫర్లా.. భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరలోనే!

Flipkart New Sale 2024: అబ్బా కుమ్మేశారు.. ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌లో ఇన్ని ఆఫర్లా.. భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరలోనే!

Flipkart Mega June Bonanza sale 2024: ఫ్లిప్‌కార్ట్‌ మరొ కొత్త సేల్‌ను తన వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. మెగా జూన్ బొనాంజా అనే కొత్త సేల్‌ను ఇవాల్టి నుంచి అంటే జూన్ 13, 2024 నుంచి స్టార్ట్ చేసింది. ఈ Flipkart సేల్‌లో వినియోగదారులు చాలా తక్కువ ధరలకు అదిరిపోయే డీల్స్, ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. మీరు Flipkart యాప్‌లో ఈ సేల్‌కి సంబంధించిన అన్ని వివరాలను కూడా చూడవచ్చు. ఈ సేల్ జూన్ 13 నుండి ప్రారంభమై జూన్ 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ పోస్టర్‌లో స్మార్ట్ టీవీ, ఫ్రిజ్, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ఏసీ, ఫర్నీచర్‌ను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేవచ్చని తెలిపింది.


కొన్ని రోజుల తర్వాత అంటే జూన్ 16న ఫాదర్స్ డే. అటువంటి సందర్భంలో చాలా మంది తమ తండ్రి కోసం ఖచ్చితంగా ఏదైనా ప్రత్యేక బహుమతిని కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి ఈ సేల్ ప్రయోజనకరంగా ఉంటుంది. బహుశా అందుకే ఫ్లిప్‌కార్ట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. ప్రజలు తమ తండ్రికి తక్కువ ధరలో ఉత్తమ బహుమతిని అందించడానికి ఈ సేల్‌ను ప్రారంభించింది.

ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై 40% తగ్గింపును ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన మొత్తం సమాచారం Flipkart యాప్‌లో జాబితా చేయబడింది. ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్‌లో మీరు Samsung, Redmi, Vivo, OnePlue వంటి అనేక ఉత్పత్తులను చౌక ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. దీనితో పాటు అనేక ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లను చౌక ధరలకు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.


Also Read: పోకో అదరగొట్టేసింది భయ్యా.. 10,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త 5జీ వెర్షన్‌ను రంగంలోకి దించింది..!

ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్‌లో టీవీలు, గృహోపరణాలపై బంపర్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ టీవీ, ఏసీ, ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చని సేల్ పోస్టర్‌లో పేర్కొంది. ఈ సేల్‌లో మీకు టీవీపై 55 నుండి 70% వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇది కాకుండా AC ప్రారంభ ధర రూ. 26,490గా లిస్ట్ చేయబడింది. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో లైఫ్‌స్టైల్, ఫ్యాషన్‌పై కూడా అదిరిపోయే డీల్‌లను అందిస్తోంది.

ఇక్కడ నుండి మీరు చాలా తక్కువ ధరలకు బట్టలు, బూట్లు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్‌లో iPhone 15పై డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 15 కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లిస్ట్ చేయబడింది. సేల్ పోస్టర్‌పై ఇదే అత్యంత తక్కువ ధర అని రాసి ఉంది. అయితే ప్రస్తుతానికి దీని ధర ఎంత ఉంటుందనే దానిపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.

Related News

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Big Stories

×