BigTV English

Gandhi’s statue in Italy vandalised: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..

Gandhi’s statue in Italy vandalised: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..

Gandhi’s statue in Italy vandalised: ప్రధాని నరేంద్రమోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహంపై అభ్యంతరకరమైన రాతలు రాశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు రాతలను చెరిపేసి మహాత్మా పీఠాన్ని శుభ్రం చేశారు.


ఇటలీలో జూన్ 13 నుంచి 15 వరకు జీ 7 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరి వెళ్లారు. అయితే బుధవారం ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని అక్కడ ప్రారంభించా రు. కొద్ది గంటల్లో ఖలిస్థానీ వేర్పాటు వాదులు రంగంలోకి దిగేశారు.

మహాత్మాగాంధీ విగ్రహంపై వివాదాస్పద రాతలు రాశారు. ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటు వాది హర్దీప్‌సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన రాతలు రాశారు. ఈ విషయం తెలియగానే స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే మహాత్మాగాంధీ విగ్రహం పీఠాన్ని శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటకు ఒకరోజు ముందు ఇలా జరగడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.


మరోవైపు ఈ ఘటనపై విదేశాంగ కార్యదర్శి క్వాత్రా స్పందించారు. దీన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారం చేపట్టాక తొలిసారి విదేశీ పర్యటన వెళ్తున్నారు. జీ7 సదస్సుకు హాజరుకావడం వరుసగా ఇది ఐదోసారి.

ALSO READ: యూఎస్‌లో ఉద్యోగం పోయింది.. వీడియో చేస్తే లక్షల్లో లైకులు..

ఇప్పుడేకాదు గతంలో ఈ తరహా ఘటనలకు పాల్పడ్డారు ఖలిస్థానీ వేర్పాటు వాదులు. పోయినేడాది కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన విషయం తెల్సిందే.

 

Tags

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×