BigTV English

CM Chandrababu take charge: సీఎం చంద్రబాబు సాయంత్రం బాధ్యతలు స్వీకరణ, ఆ తర్వాత శాఖల కేటాయింపు

CM Chandrababu take charge: సీఎం చంద్రబాబు సాయంత్రం బాధ్యతలు స్వీకరణ, ఆ తర్వాత శాఖల కేటాయింపు

Chandrababu naidu latest news(AP political news): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్ర బాధ్యతలు తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో చరిత్రలో నిలిచిపోయేలా ఐదు హామీలపై సంతకాలు చేయనున్నారు.


తొలి సంతకం మెగా డీఎస్సీపై సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన చేయాల్సివుంది. ప్రస్తుతం విద్యా సంస్థల్లో 13 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక మూడోది అధికారంలోకి రాగానే పింఛను 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని ప్రకటించారు.

దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగో హామీ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను నిలిపివేసింది. చివరిది యువతకు నైపుణ్య గణన దస్త్రంపై సంతకం చేయనున్నారు. ఇలాంటి గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేలనుంది.


CM Chandrababu talks with cabinet ministers
CM Chandrababu talks with cabinet ministers

ఈ కార్యక్రమం తర్వాత మంత్రులకు తమతమ శాఖలను కేటాయించనున్నారు సీఎం చంద్రబాబు. అయితే జనసేనకు కీలక శాఖలను కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే ఛాన్స్ ఉంది.

ALSO READ: శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, ప్రోటోకాల్, పరదాల విషయంలో..

ఇక నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలను ఇవ్వనున్నట్లు సమాచారం. మరి బీజేపీకి ఎలాంటి శాఖ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది దేవాదాయ శాఖను ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇదికాకుండా మరేదైనా కేటాయిస్తారా అనేది చూడాలి.

Tags

Related News

YS Jagan: వాళ్లు ఫోన్ చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నారు.. పార్టీ నేతలపై జగన్ ఫైర్!

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Big Stories

×